రామచరితమానస్ కాపీలను తగలబెట్టిన కేసులో ఇద్దరిపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగం..

By SumaBala BukkaFirst Published Feb 6, 2023, 1:25 PM IST
Highlights

జాతీయ భద్రతా చట్టం ప్రయోగించబడిన సలీం, సత్యేంద్ర కుష్వాహాతో పాటు మరో 10 మంది వ్యక్తులు రామచరిత్మానస్ కాపీలను తగలబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

లక్నో : రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన రామచరితమానస్ ప్రతులను తగులబెట్టినందుకు ఇద్దరు వ్యక్తులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. "జనవరి 29, 2023న శ్రీ రామచరిత్మానస్ ప్రతులను సలీం, సత్యేంద్ర కుష్వాహ అనే ఇద్దరు వ్యక్తులు తగలబెట్టారు. ఈ కేసు నెం. 75/23. దీనికి సంబంధించిన కేసులో లక్నో పోలీసులకు వీరిద్దరినీ అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. 

వీరిద్దరినీ నిందితులుగా పేర్కొంటూ లక్నో జిల్లా జైలులో సెక్షన్ 3 కింద నిర్బంధించారు. ఇలాంటి చర్యలతో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని జాతీయ భద్రతా చట్టం (NSA)లోని సెక్షన్ 2 కింద వీరిని అరెస్ట్ చేశాం" అని లక్నో పోలీసులు తెలిపారు.

కాళ్లు, చేతులు కట్టేసి 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. ఇద్దరు అరెస్టు: అసోం పోలీసులు

ఆరోపణల ప్రకారం, సలీం, సత్యేంద్ర కుష్వాహాతో పాటు మరో 10 మంది వ్యక్తులు రామచరిత్మానస్ కాపీలను తగలబెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. గత నెల, ఎస్పీ లీడర్ స్వామి ప్రసాద్ మౌర్య రామచరిత్మానస్‌లో నిర్దిష్ట కులాలు, వర్గాలను లక్ష్యంగా చేసుకుని "అవమానకరమైన వ్యాఖ్యలు, వ్యంగ్య వ్యాఖ్యలు" తొలగించాలని డిమాండ్ చేసిన తర్వాత వివాదానికి దారితీసింది. తులసీదాస్ రచించిన రామచరితమానస్‌లో దళితుల మనోభావాలను దెబ్బతీసే మాటలు ఉన్నాయని మౌర్య పేర్కొన్నారు.

click me!