ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీలో హింస: విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ల కొట్టివేసిన సుప్రీం

By narsimha lodeFirst Published Feb 3, 2021, 12:45 PM IST
Highlights

ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవం రోజున రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం నాడు తిరస్కరించింది.  
 

న్యూఢిల్లీ: ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవం రోజున రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం నాడు తిరస్కరించింది.  

రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ సమయంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకొన్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో అనేక ఘటనలు చోటు చేసుకొన్నాయి. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు ఈ ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

also read:ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో హింస: దీప్‌సిద్దుపై రూ. 1లక్ష రివార్డు ప్రకటన

పోలీసులు సూచించిన మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో కూడ నిరసనకారులు ప్రవేశించారు.నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పోలీసులు, నిరసనకారులకు మధ్య తీవ్ర తోపులాటలు చోటు చేసుకొన్నాయి.

రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనపై చర్యలు తీసుకోవాలని ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి.  ఈ హింసాత్మక ఘటనలపై ఎన్ఐఏ దర్యాప్తును కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది.

రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయాలని కూడ పిటిషనర్ కోరారు.
 

click me!