ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసే ఈ వాచ్ యాప్ పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై విచారణను రేపు జరుపుతామని హైకోర్టు తెలిపింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసే ఈ -వాచ్ యాప్ పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై విచారణను రేపు జరుపుతామని హైకోర్టు తెలిపింది.
ఈ -వాచ్ యాప్ పూర్తిగా ప్రైవేట్ యాప్ అని ప్రభుత్వం పేర్కొంది.ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
ఈసీకి చెందిన సి-విజిల్ యాప్ లేదా ప్రభుత్వ యాప్ ను ఉపయోగించాలని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. ఈ యాప్ టీడీపీ కనుసన్నల్లో తయారైందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది.
ఈ యాప్ ను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై గురువారం నాడు విచారణ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రైవేట్ గా ఎందుకు ఈ యాప్ ను తీసుకొస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ యాప్ పై వైసీపీ సర్కార్ అనే అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలోనే యాప్ ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.