ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో హింస: దీప్‌సిద్దుపై రూ. 1లక్ష రివార్డు ప్రకటన

Published : Feb 03, 2021, 11:14 AM IST
ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో హింస: దీప్‌సిద్దుపై రూ. 1లక్ష రివార్డు ప్రకటన

సారాంశం

రిపబ్లిక్ డే సందర్భంగా రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో  విధ్వంసానికి కారణమైన నటుడు, సింగర్ దీప్ సిద్దుపై లక్ష రూపాయాల రివార్డును ఢిల్లీ పోలీసులు బుధవారం నాడు ప్రకటించారు.  

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో  విధ్వంసానికి కారణమైన నటుడు, సింగర్ దీప్ సిద్దుపై లక్ష రూపాయాల రివార్డును ఢిల్లీ పోలీసులు బుధవారం నాడు ప్రకటించారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో విధ్వంసం చోటు చేసుకొంది. ఎర్రకోట నుండి దీప్ సిద్దు ఫేస్ బుక్ లైవ్ కూడ ఇచ్చారు.ఈ ఘటన జరిగిన నుండి ఆయన కన్పించకుండా పోయాడు అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఢిల్లీ పోలీసులు దీప్ సిద్దు ఆచూకీ తెలిపితే లక్ష రూపాయాల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. దీప్ సిద్దూతో పాటు మరో ముగ్గురిపై కూడ పోలీసులు ప్రకటించారు. దీప్ సిద్దు కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకొన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. దీప్ సిద్దు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. దీప్‌సిద్దు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Trump Next Target: వెనెజులా ఫినిష్.. ట్రంప్ తరువాతి టార్గెట్ ఈ అందమైన దేశమే
Artificial Intelligence : చాట్ జిపిటి, జెమినిని అస్సలు అడగకూడని విషయాలివే... అడిగారో అంతే సంగతి..!