ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

By narsimha lodeFirst Published Jan 28, 2022, 11:46 AM IST
Highlights


ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడంపై కొత్త కొలమానం వేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.  


న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడంపై కొత్త కొలమానం వేయలేమని Supreme court  ధర్మాసనం అభిప్రాయపడింది.  ప్రమోషన్లలో రిజర్వేషన్లను కల్పించే షరతులను డైల్యూట్ చేయలేమని కూడా ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.

ఎస్సీ, ఎస్టీ Employees ప్రమోషన్లలో Reservations కల్పించే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు  డేటాను సేకరించాలని సుప్రీంకోర్టు సూచించింది జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం నాడు ఈ తీర్పును వెలువరించింది.  రిజర్వేషన్ల డేటాను కేడర్ ఆధారిత ఖాళీల ఆధారంగా సేకరించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.

స్వాతంత్ర్యం వచ్చి సుమారు 75 ఏళ్లు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారిని అగ్రవర్ణాల మెరిట్ స్థాయికి తీసుకురాలేదన్నది జీవిత సత్యమని కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీం ధర్మాసనానికి తెలిపింది. నాగరాజు, జర్తైల్ సింగ్ ల కేసుల్లో రాజ్యాంగ ధర్మాసం నిర్ధేశించిన ప్రమాణాలను డైల్యూట్ చేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.


నాగరాజు కేసులో ....

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతిలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన తీర్పుపై చర్చను పునఃప్రారంభించేందుకు సిద్ధంగా లేమని సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలోనే అభిప్రాయపడింది.  జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై జూన్ 2018లో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి  మార్గాలను కనుగొనడం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉందని కోర్టు  పునరుద్ఘాటించింది.

2018లో 58 పేజీల తీర్పులో కీలక విషయాలను ప్రస్తావించింది.  అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2006 నాటి తీర్పును సవరించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగల వెనుకబడినట్టుగా నిరూపించడానికి రాష్ట్రం  డేటాను చూపించవలసి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్‌లో కోటా కల్పించాలని ఆదేశించింది.

2018లో జర్నైల్ సింగ్ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ తీర్పు... ప్రభుత్వ సేవల్లో  SC, ST ఉద్యోగులకు పర్యవసానంగా సీనియారిటీతో కూడిన వేగవంతమైన promotion అందించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు భారీ ఊరటనిచ్చింది.

ఇందిరా సాహ్నీ కేసులో "వెనుకబడిన తరగతి పౌరులు" అనే వ్యక్తీకరణలో నిస్సందేహంగా వచ్చే షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సామాజిక,విద్యాపరమైన వెనుకబాటుతనానికి సంబంధించిన పరీక్ష లేదా ఆవశ్యకత వర్తించదని కోర్టు పేర్కొంది.

Nagaraju case  తీర్పును ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి రిఫర్ చేసేందుకు రాజ్యాంగ ధర్మాసనం నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ యొక్క బలాన్ని భారతదేశ జనాభాతో పోల్చడం వారికి ప్రభుత్వ సేవల్లో తగిన ప్రాతినిధ్యం ఉందో లేదో నిర్ధారించడానికి పరీక్ష కాదనే ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తోసిపుచ్చింది. ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి తగిన ప్రాతినిథ్యం కల్పించాలనే ప్రశ్న సంబంధిత రాష్ట్రాలకే వదిలేయాలని నిర్ణయించింది.

 ఈ కేసు తీర్పు సందర్భంగా జస్టిస్ రావు మాట్లాడుతూ నాగరాజ్ లేదా జర్నైల్ సింగ్‌లను తిరిగి తెరిచే ఉద్దేశ్యం కోర్టుకు లేదని అన్నారు. రాష్ట్రాలు తీర్పులకు కట్టుబడి ఉండాలని కోరింది. కేసు పరిధిని విస్తరించడానికి లేదా మళ్లించడానికి ప్రయత్నించకూడదని న్యాయస్థానం భావిస్తోందన్నారు.   పదోన్నతుల్లో రిజర్వేషన్ల తీర్పును అమలు చేయాలని కోరుతూ దాఖలైన 130కి పైగా పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వానికి ఏమి చేయాలో సలహా ఇవ్వడానికి మేము ఇక్కడ లేము. పాలసీని ఎలా అమలు చేయాలో ప్రభుత్వానికి చెప్పడం మా వల్ల కాదని జస్టిస్ రావు చెప్పారు. రాష్ట్రాలు దీనిని ఎలా అమలు చేయాలన్నారు. 
 

click me!