Sabarimala case: స్టేకు సుప్రీం నిరాకరణ, విస్తృత ధర్మాసనానికి కేసు

By narsimha lodeFirst Published Nov 14, 2019, 10:48 AM IST
Highlights

బరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకొంది

న్యూఢిల్లీ:శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకొంది. మెజార్టీ జడ్జిల అభిప్రాయంతో జస్టిస్ జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్‌లు విభేదించారు. 

ALSO READ:శబరిమల ఆలయంలోకి మహిళలు.. నేడే తుది తీర్పు

ఈ విషయమై మెజారిటీ జడ్జిల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.  శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసం ఎటూ తేల్చలేదు. శబరిమల  ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి రివ్యూ పిటిషన్లన్నీ పెండింగ్‌లో ఉంటాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.  

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి  ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో  3-2 తేడాతో తీర్పును ఇచ్చింది. దీంతో ఈ విషయమై విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం అభిప్రాయపడింది.

2018లో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి  ఇచ్చిన ఇచ్చిన తీర్పుపై  సుప్రీంకోర్టు మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. శబరిమల ఆలయంలోలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడు తీర్పును  వెల్లడించింది.

ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంటుందని రంజన్ గొగోయ్ చెప్పారు.  ఆలయాల్లో మహిళల ప్రవేశంపై ఒకే మతంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సీజే చెప్పారు. మహిళలు ఆలయాల ప్రవేశం ఈ ఒక్క ఆలయానికే సంబంధించింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

మతంలో అంతర్గత వివాదం ఏమిటనేది తేల్చడమే తమ ముందున్నపని  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గోగొయ్ చెప్పారు.  మత విశ్వాసం అనేది పౌరుల హక్కు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

శబరిమల ఆలయంలోకి 10-50ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ  2018 సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుపై అయ్యప్ప భక్తులు, హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. అయ్యప్ప భక్తులు నిరసనలు చేపట్టారు. కేరళలో రాజకీయంగా ఎదగడానికి శ్రమిస్తున్న బీజేపీ-శబరిమల వివాదాన్ని ఓ అస్త్రంగా వాడుతుండటం, దానిని నిలువరించేందుకు లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం నియంత్రించడంతో ఇదో రాజకీయ రణక్షేత్రంగానూ మారింది.

ఈ నేపథ్యంలో గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుకి రివ్యూ పిటిషన్‌కు సుప్రీంకోర్టు అనుమతించింది. దీనిపై మొత్తం 56 పిటిషన్ల దాఖలు కాగా, చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ రోహిటన్ నారిమన్, ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హొత్రాలతో కూడి ధర్మాసనం ధర్మాసనం గురువారం ఉదయం 10.30 గంటలకు తీర్పు చెప్పింది.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేరళలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. శబరిమలలో 10 వేల మంది పోలీసులను మోహరించారు. గతేడాది తీర్పు తర్వాత శబరిమలలో తలెత్తిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. గతేడాది ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఫిబ్రవరి 6న రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వివిధ పక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టాలని నాయర్‌ సర్వీస్‌ సొసైటీ తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది కే పరాశరన్‌ విజ్ఞప్తి చేశారు.


 

click me!