కర్ణాటక ఉప ఎన్నికలు: బీజేపీలోకి అనర్హత ఎమ్మెల్యేలు..

By telugu teamFirst Published Nov 14, 2019, 8:27 AM IST
Highlights

సుప్రీం తీర్పు అనంతరం  కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ, 17 మంది అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఉపఎన్నికల్లో పోటీ చేయవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉపఎన్నికలు జరగనున్న అన్ని నియోజకవర్గాల్లో రేపటి నుంచి తాము పర్యటిస్తామని తెలిపారు.


కర్ణాటక నాట రాజకీయం మరింత ఆసక్తిగా మారింది. తామంతా గురువారం బీజేపీలో చేరుతున్నట్లు 17మంది అనర్హత ఎమ్మెల్యేలు చెప్పారు. ఢిల్లీలో ఈ విషయాన్ని వారు ప్రకటించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ భేటిలోనూ వారి రాకను  స్వాగతిస్తూ తీర్మానిచారు. అదే సమయంలో ఈ 17మందికీ రానున్న ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ఇచ్చే అంశం అధిష్టానం పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా... కర్ణాటకలో 17మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్ పై బుధవారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పు అనర్హత ఎమ్మెల్యేలకు అనుకూలంగా రావడం గమనార్హం. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

సుప్రీం తీర్పు అనంతరం  కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ, 17 మంది అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఉపఎన్నికల్లో పోటీ చేయవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉపఎన్నికలు జరగనున్న అన్ని నియోజకవర్గాల్లో రేపటి నుంచి తాము పర్యటిస్తామని తెలిపారు. ఈ 17 స్థానాలను బీజేపీ నూటికి నూటొక్క శాతం గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోబోతున్నారా? అనే ప్రశ్రకు సమాధానంగా... సాయంత్రం వరకు వేచి చూడండని యడియూరప్ప చెప్పారు. తమ హైకమాండ్ తో పాటు, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలతో తాను చర్చిస్తానని తెలిపారు. సాయంత్రంలోగా ఒక సముచిత నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. అయితే.. తాము బీజేపీలోనే చేరతామంటూ ఆ ఎమ్మెల్యేలు ప్రకటించడం గమనార్హం. 

click me!