గోవా రాజకీయాల్లో సంజయ్ రౌత్ వేలు... అక్కడ బీజేపీ అధికారం కోల్పోతుందని జోశ్యం

By telugu team  |  First Published Nov 29, 2019, 4:00 PM IST

ఇక తాను రాజకీయాలకు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు, ఇక పత్రిక బాధ్యతలతో బిజీగా ఉంటానని నిన్ననే ప్రకటించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెల్లారే మాట మార్చేశారు. నేటి ఉదయం ఆయన రాజకీయాలను మహారాష్ట్రతో ఆపకుండా ఏకంగా పక్కరాష్ట్రమైన గోవాకు కూడా విస్తరించే పనుల్లో బిజీ అయినట్టు మనకు అర్థమవుతుంది. 

Latest Videos

undefined

మహారాష్ట్రలో ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కూటమి కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.గోవాలోనూ కొత్త రాజకీయ ఫ్రంట్ రూపుదిద్దుకుంటున్నట్టు శివసేన ఎంపీ, సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు.

Also read: ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవడం వెనుక ఉన్నదీ ఈవిడే...

బీజేపీ పాలిత గోవాలో గోవా ఫార్వార్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ) అధ్యక్షుడు విజయ్‌ సర్ధేశాయ్‌ ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం ఉదయం సంజయ్‌ రౌత్‌తో భేటీ కావడం బీజేపీ వర్గాల్లో గుబులు రేపుతోంది. గోవాలో నెలకొన్న రాజకీయ పరిస్థితిపై వారు చర్చించినట్టు ప్రచారం సాగడంతో బీజేపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి  

జీఎఫ్‌పీ చీఫ్‌ విజయ్‌ సర్ధేశాయ్‌ సహా కనీసం నలుగురు ఎమ్మెల్యేలు శివసేనతో టచ్‌లో ఉన్నారని రౌత్‌ పేర్కొన్నారు.మహరాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ చీఫ్‌ సుధిన్‌ దవిల్కార్‌తోనూ తాను మాట్లాడానని, గోవా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొద్దిమంది ఇతర ఎమ్మెల్యేలూ తమతో టచ్‌లో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.  

గోవా ప్రభుత్వాన్ని అనైతికంగా ఏర్పాటు చేశారని, కాంగ్రెస్‌ సహా పలు పార్టీలతో తాము ప్రత్యేక ఫ్రంట్‌ను నెలకొల్పి గోవాలో త్వరలోనే అద్భుతం చోటుచేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర తరహా మేజిక్‌ను గోవాలో పునరావృతం చేస్తామని గోవా మాజీ డిప్యూటీ సీఎం విజయ్‌ సర్ధేశాయ్‌ చెప్పారు.  

Also read: 'అష్ట'దిగ్గజ నవ నాయకుడు ఉద్ధవ్
 
శుక్రవారంనాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, గోవా ఫార్వార్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు శివసేనతో పొత్తు పెట్టుకోనున్నాయని, మహారాష్ట్రా తరహాలోనే గోవాలో కొత్త రాజకీయ ఫ్రంట్ రూపుదిద్దుకుంటోందని తెలిపారు. 'గోవాలో జరిగే మ్యాజిక్‌ను మీరు త్వరలోనే చూడబోతున్నారు' అని సంజయ్ రౌత్ చెప్పారు.
 
బీజేపీయేతర రాజకీయ ఫ్రంట్...

దేశంలో బీజేపీయేతర రాజకీయ ఫ్రంట్‌ను తాము రూపొందించాలని అనుకుంటున్నట్టు రౌత్ వివరించారు. 'మహారాష్ట్ర తర్వాత గోవా, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాం. దేశంలో బీజేయేతర రాజకీయ ఫ్రంట్‌ను రూపొందిస్తాం' అని ఆయన పేర్కొన్నారు. 

click me!