ఒక పురుషుడికి, స్త్రీకి మధ్య జరిగిన వివాహాన్ని మాత్రమే భారత చట్టం గుర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో సోమవారం తన వాదనలు వినిపించింది.
ఒక పురుషుడికి, స్త్రీకి మధ్య జరిగిన వివాహాన్ని మాత్రమే భారత చట్టం గుర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో సోమవారం తన వాదనలు వినిపించింది. స్వలింగ సంపర్కం క్రిమినల్ నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. స్వలింగ వివాహాలను (same-sex marriages) గుర్తించడం లేదంటూ దాఖలైన వ్యాజ్యాలపై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యలను విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎస్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌ల ధర్మాసనం ముందు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా వాదనలు వినిపించారు. ‘జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య. వివాహం అనేది భిన్న లింగ జంటలకు సంబంధించిన పదం’అని ప్రభుత్వం అఫిడవిట్‌లో వెల్లడించిన విషయాన్ని మరోసారి చెప్పారు.
స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పునకు తప్పుడు అన్వయం చేస్తున్నారని తుషార్ మోహతా అన్నారు. సుప్రీం కోర్టు స్వలింగ సంపర్కం క్రిమినల్ నేరం కాదని మాత్రమే చెప్పిందని.. వివాహాల గురించి చెప్పలేదని అన్నారు. ఈ విషయాన్ని ధర్మాసనం పరిశీలించాలని కోరారు. వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక కాదని.. స్త్రీ-పురుషుల మధ్య నెలకొనే వ్యవస్థ అని తెలిపారు. భర్త అంటే బయోలాజికల్ పురుషుడు ( biological man), భార్య బయోలాజికల్ స్త్రీ (biological woman) కాదన్న అర్థం చెబితే చట్టాల్లో గందరగోళం ఏర్పడుతుందని అన్నారు. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకుంటే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు.
undefined
అదే సమయంలో స్వలింగ వివాహాలను గుర్తించడం లేదంటూ దాఖలైన వ్యాజ్యాలపై సంబంధిత న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఇద్దరు మహిళలు వినతి సమర్పించారు. స్వలింగ వివాహానికి చట్టంలోని నిబంధనలు అనుకూలంగా లేవని ఫిర్యాదు చేశారు. వివాహాన్ని గుర్తించకపోవడం తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. వీరి తరఫున సంబంధిత న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఓ పురుష జంట తరఫున న్యాయవాది కరుణ నంది వానదలు వినిపించారు. వారిద్దరు న్యూయార్క్‌లో వివాహం చేసుకున్నారని తెలిపారు. వారికి పౌరసత్వ చట్టం, విదేశీ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం వర్తిస్తాయని చెప్పారు. ఓసీఐ కార్డు ఉన్నవారు విదేశీయులను పెళ్లి చేసుకుంటే ఆ భాగస్వామికి రెండేళ్ల అనంతరం పౌరసత్వం ఇవ్వాలనే నిబంధన ఉందని, కానీ కేంద్రం దీన్ని వర్తింప చేయడం లేదని అన్నారు. తమ పిటిషనర్ల వ్యాజ్యానికి కేంద్ర ప్రభుత్వ ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదని చెప్పారు.
Also read: పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేత: బీఎస్ఎఫ్ జవాన్ ను అరెస్ట్ చేసిన ఏటీఎస్
ఈ క్రమంలోనే స్వలింగ వివాహాలకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై నంబర్ 30న తుది విచారణ చేపట్టనున్నట్టుగా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈలోపు వివరణలు, సమాధానాలు, ఖండనలు ఉండే సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది