భారతదేశంలో స్వలింగ వివాహం: సుప్రీంకోర్టు పరిగణించవలసిన అంశాలు..

By Asianet News  |  First Published May 2, 2023, 1:07 PM IST

స్వలింగ వివాహాల చట్టబద్ధతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. భారతీయ విశ్వాసాలతో, సామాజిక అంశాలతో ముడిపడి ఉండటంతో సెమ్ సెక్స్ మ్యారేజ్ సమస్య వివాదాస్పద అంశంగా మారింది. ఈ సమయంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా  పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 


దేశవ్యాప్తంగా స్వలింగ వివాహాల చట్టబద్ధతపై చర్చ జరుగుతున్నది. మన దేశ విశ్వాసాలతో, సామాజిక అంశాలతో ముడిపడి ఉండటంతో సెమ్ సెక్స్ మ్యారేజ్ అంశం వివాదాస్పద సమస్యగా మారింది. 2018లో స్వలింగ సంపర్కారుల వివాహన్ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి స్వలింగ వివాహాల చట్టబద్ధతపై మళ్లింది. అదే సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బెంచ్ ముందు ఈ కీలకమైన అంశంపై మూడు ప్రశ్నలు ఉన్నాయి.  

ప్రశ్న 1: సాంస్కృతిక , మత సామర్యం, పౌరుల రాజ్యాంగ హక్కులను కోర్టు ఎలా సమతుల్యం చేస్తుంది?

Latest Videos

undefined

భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. అనేక మతాలు, సాంస్కృతిక విశ్వాసాలకు నిలయం. అదే సమయంలో మనదేశంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానముంది. భారతీయ విశ్వాసాలతో, సామాజిక సమూహాలతో ముడిపడింది.పెళ్లి అనేది సమాజానికి ఆధారం. వైవాహిక బంధంతో స్త్రీ,పురుషుల కలయిక, మానవ సంతానోత్పత్తి పాత్రను నెరవేర్చడానికి ఉద్దేశించబడింది. అలాగే..వివాహ వ్యవస్థతో పిల్లల సంరక్షణ, ఆస్తి హక్కులు,వారసత్వం,సామాజిక క్రమం వంటి దానిని అనుసరిస్తాయి.

సంతానోత్పత్తి పాత్రను వివాహ వ్యవస్థ నుండి తీసివేస్తే.. వివాహం అనే ఆలోచన సవాలుగా మారుతుంది. సంతానోత్పత్తి అనేది లేకపోతే.. ఇద్దరు మనుషుల కలయికకు వేరే పేరు ఎందుకు పెట్టకూడదు? అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి. ఈ సున్నిత ఆంశాన్ని సుప్రీంకోర్టు జాగ్రత్తగా పరిశీలించాలి. అటు సంప్రదాయాలను గౌరవించడం, మరోవైపు సమాజ పురోగతిని సమర్థించడంలో సమతుల్యం పాటించడం కోర్టు ముందున్న అతి పెద్ద సవాలు.

అవగాహన, ఐక్యత పూరిత వాతావరణాన్ని సృష్టించడానికి న్యాయస్థానం సమ్మిళిత సంభాషణను సులభతరం చేస్తుంది. మత పెద్దలు, LGBTQ+ కార్యకర్తలు, న్యాయ నిపుణులను నిమగ్నం చేస్తుంది. సాంస్కృతిక,మతపరమైన విలువల ప్రాముఖ్యతను గుర్తించడం ద్వారా.. సమానత్వం, న్యాయాన్ని సమర్థిస్తూ భిన్నత్వాన్ని గౌరవించే నిర్ణయం సుప్రీంకోర్టు పైనే ఉంది. 

ప్రశ్న 2: భారతదేశంలో స్వలింగ వివాహానికి మద్దతుగా ఎలాంటి చట్టాలను రూపొందించవచ్చు?

స్వలింగ వివాహాలను ఇప్పటికే పలు దేశాల్లో చట్టపరం చేశారు. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు పరిశీలించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది. అయితే.. ఈ వివాహాలను చట్టబద్దం చేసిన దేశాల అనుభవాలను కూడా అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ఇలాంటి చట్టాలను అమలు చేస్తే.. భారతీయ సమాజంపై ఎలా ప్రభావం పడుతుందనే అంశాన్ని జాగ్రత్తగా అంచనా వేయాలి.

నిజానికి చాలా పాశ్చాత్య సమాజాలలో స్వలింగ వివాహాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా మారాయి. భారతదేశంలో ఈ పద్ధతిని అనుమతించడమంటే కష్టతరమేనని భావించాలి. విదేశాల్లో ఆచరణలో ఉన్నవన్నీ.. మనం దత్తత తీసుకోవడానికి తొందరపడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో పలు మతాలు, సాంస్కృతిక విశ్వాసాలు, సంప్రదాయాల ఉన్నాయి. ఇలాంటి అమలు కాల పరీక్షగా నిలిచాయి. భారతీయ సమాజానికి విధ్వంసకర ప్రభావాలను కలిగించే ప్రతి కొత్త ఆలోచనపై మనం అచితూచి వ్యవహరించాలి.  

ప్రశ్న 3: ఎంపిక స్వేచ్ఛను సుప్రీంకోర్టు ఎంతవరకు విస్తరించగలదు?

ఇదే సమయంలో మరో ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది ? నేడు స్వలింగ సంపర్కులకు అనుకూల చట్టాలను చేస్తే.. రేపటి రోజు మరో వర్గం వారు అక్రమ సంబంధాన్ని చట్టబద్ధం చేయాలని పిలుపునిస్తే సుప్రీంకోర్టు వైఖరి ఏమిటి? . భవిష్యత్తులో నిషేధిత సంబంధాలను చట్టబద్ధం చేయాలనే డిమాండ్‌లు వస్తే.. సుప్రీంకోర్టు దానిని ఎలా చూస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఇది విడ్డూరమని సీజేఐ చంద్రచూడ్‌ బదులిచ్చారు. భవిష్యత్తుకు అంతులేదని అన్నారు.

ఇద్దరు వయోజనులు తమ ఇష్టానుసారంగా జీవించడానికి చట్టబద్ధం చేయాలనే డిమాండ్ జర్మనీలో చాలా కాలంగా ఉంది.  అలాగే.. న్యూయార్క్‌లో కూడా వివాహేతర సంబంధాలను అంగీకరించడానికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహించబడ్డాయి. కానీ అడ్డువేయడంతో ఆ చర్యకు తెరపడింది. ఈ  నిర్ణయాలకు కూడా సుప్రీం కోర్టు పరిగణించాలి. స్వలింగ వివాహాల విషయంలో కోర్టు తప్పనిసరిగా సాంస్కృతిక, మతపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల భారతీయ సమాజానికి వినాశకరమైన పరిణామాలు చోటుచేసుకోవచ్చు.

రచయిత: డా. షోమైలా వార్సీ, పీహెచ్‌డీ, కిరోరి మాల్ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ.

click me!