
సమాజ్‌వాదీ పార్టీ దివంగత నాయకుడు, ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ సోమవారం లోక్ సభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల మెయిన్‌పురి పార్లమెంటరీ ఉప ఎన్నికలో ఆమె గెలుపొందారు. బీజేపీకి చెందిన రఘురాజ్ సింగ్ షాక్యాపై 2,88,461 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించి పార్టీలో ఉత్సాహాన్ని నింపారు.
ఘనంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారోత్సవం.. హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా
లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె ప్రతిపక్ష బెంచీల్లో ముందు వరుసలో కూర్చున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా దగ్గరకు వెళ్లారు. ఆమె పాదాలను తాకి నమస్కరించారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్ పురి లోక్ సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
కోల్ కత్తాలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు..
చాలా ఏళ్లుగా ఆ నియోజకవర్గం నుంచి ములాయం సింగ్ గెలుపొందుతూ వస్తున్నారు. 1996లో అక్కడి నుంచి మొదటి సారిగా ఆయన పోటీ చేసి గెలిపొందారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం సమాజ్ వాదీ పార్టీకి బలమైన కంచుకోటలా ఉంది. అందుకే అక్కడి నుంచి డింపుల్ యాదవ్ భారీ తేడాతో గెలుపొందారు. అయితే ఈ విజయం ఆమె జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ 94,000 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ షాక్యాను ఓడించి మరో సారి మెయిన్‌పురి సీటును సొంతం చేసుకున్నారు. అక్కడ తన ప్రభంజనానికి తిరుగులేదని నిరూపించారు. అయితే సమాజ్ వాదీ పార్టీ 2019 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో కలిసి పోటీ చేసింది. ఈ సారి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పలు చిన్న పార్టీలో కలిసి పోటీలో నిలిచింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మరో సారి సమాజ్ వాదీ పార్టీ ప్రతిపక్షంలోనే కూర్చుంది.
పుదుచ్చేరిలో ద్రవిడియన్ మోడల్ ఉండాలి.. ఇక్కడ గవర్నర్ చెప్పుచేతల్లో సీఎం: ఎంకే స్టాలిన్
కాగా.. ఈ సారి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మొదటి సారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అంతకు ముందు ఆయన సీఎంగా పని చేసినప్పటికీ శాసన మండలికి నామినేట్ అయి పదవిలో కొనసాగారు. అలాగే ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మొదటి సారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. గత టర్మ్ లో ఆయన శాసన మండలికి ప్రాతినిధ్యం వహించారు.