కోల్ కత్తాలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు..

By team teluguFirst Published Dec 12, 2022, 3:11 PM IST
Highlights

కోల్ కతాలో ప్లాస్టిక్ తయారు చేసే ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ సంభవించలేదు. అయితే మంటలను ఆర్పేందుకు 10 ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కోల్ కతా కు సమీపంలో ఉన్న  తంగ్రాలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి 10 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. తిలాఖానా సమీపంలో ఉన్న ఓ ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో, దాని పక్కనే ఉన్న గోదాంలో మంటలు సోమవారం ఉదయం ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. లోపల మండే పదార్థాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. 

పుదుచ్చేరిలో ద్రవిడియన్ మోడల్ ఉండాలి.. ఇక్కడ గవర్నర్ చెప్పుచేతల్లో సీఎం: ఎంకే స్టాలిన్

మంటలను ఆపేందుకు ఫైర్ సిబ్బంది విపరీతంగా శ్రమించడంతో మధ్యాహ్నం 1.00 గంటల వరకు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ అగ్నిప్రమాదంతో స్థానికంగా గందరగోళం చెలరేగింది. అయితే ఈ మంటలు చెలరేగడానికి కారణం ఏంటనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాత దీనిపై విచారణ జరుపుతామని స్థానిక అధికారులు వెల్లడించారు. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణస్వీకారం.. ఆయన నేపథ్యం ఏంటంటే ?

కాగా.. ఈ ఫ్యాక్టరీలో మంటలు చెలరిగిన కొంత సమయం తరువాత సమీపంలోని దుకాణాల్లో మంటలు వ్యాపించాయి. వీటిని నియంత్రించేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే ఫ్యాక్టరీలో ఎప్పటిలాగే యథావిథిగా పనులు కొనసాగుతున్న సమయంలో ఒక్క సారిగా నల్లటి పొగలు రావడం మొదలైందని స్థానికులు చెప్పారు. కొంత సమయంలోనే ఫ్యాక్టరీ మొత్తం మంటలు చుట్టుముట్టాయని అన్నారు. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిమాపక వ్యవస్థ లేదని, దీంతో మంటలు క్షణాల్లోనే వ్యాపించాయని ఫ్యాక్టరీ కార్మికులు తెలిపారు. 
 

click me!