సాయిబాబా దేవుడు కాదు.. ఫకీరు మాత్రమే - బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర శాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Published : Apr 03, 2023, 01:02 PM IST
సాయిబాబా దేవుడు కాదు.. ఫకీరు మాత్రమే - బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర శాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

సారాంశం

సాయిబాబా దేవుడు కాదని, ఆయన ఒక ఫకీరు మాత్రమే అని బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర శాస్త్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయని, కానీ సాయిబాబా కేవలం ఫకీరే అని తెలిపారు. 

సమాజంలోని అనేక వర్గాల ప్రజలు ఆరాధించే సాయిబాబాపై స్వయం ప్రకటిత దైవం, బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సాయిబాబాను సాధువు లేదా ఫకీరు అని పిలవవచ్చని, కానీ యనను దేవుడు అని పిలవలేమని అన్నారు.

తమిళనాడులో బీజేపీకి సొంత టీవీ ఛానల్

సాయిబాబాకు శంకరాచార్యులు దైవస్థానం ఇవ్వలేదని ధీరేంద్ర శాస్త్రి అన్నారు. ‘‘శంకరాచార్యులు మన ధర్మానికి ప్రధాని కాబట్టి ఆయనను గౌరవించడం ప్రతీ సనాతనీ కర్తవ్యం. గోస్వామి తులసీదాస్ జీ అయినా, సూర్దాస్ జీ అయినా మన ధర్మానికి చెందిన ఏ సాధువు అయినా కానివ్వండి.. ఆయనను గొప్ప వ్యక్తి, యుగ పురుషుడు, కల్ప పురుషుడు అనొచ్చు. కానీ దేవుడు అనలేం’’ అని అన్నారు. అయితే ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. ఎవరి నమ్మకాన్ని దెబ్బతీయలేమని, కానీ సాయిబాబా సాధువు, ఫకీరు కావచ్చు కానీ దేవుడు కాలేరని అన్నారు.

ఆయన తన వ్యాఖ్యలను సమర్థిస్తూ ‘‘ప్రజలు మనం ఇలా మాట్లాడడాన్ని వివాదం చేస్తారు.. కానీ నక్క చర్మాన్ని ధరించినంత మాత్రనా.. అది సింహం అయిపోదు’’ అని అన్నారు.  “మనం శంకరాచార్యుల గొడుగు వేసుకుని, సింహాసనం మీద ఉంచి శంకరాచార్యులమని చెప్పుకుంటే.. మనం శంకరాచార్యులం అయిపోతామా ? కాలేరు. దేవుడు మాత్రమే దేవుడు. సాధువులు కేవలం సాధువులే. ఓ వ్యక్తి తనకున్న నమ్మకాన్ని అలాగే ఉంచుకోవాలి. కానీ సాయి దేవుడు కాదు అని మన శంకరాచార్యులు చెప్పారు. ’’ అని అన్నారు.

తెలంగాణ హై కోర్టు తొలి సీజే జస్టిస్ టీబీ రాధా కృష్ణన్ ఇకలేరు..

అంతకు ముందు కోర్టు నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. “సాయిబాబా సనాతనవాది కాదని, హిందువు కాదని కోర్టు చెప్పింది. అలాగే శంకరాచార్య జీకి క్షమాపణ కూడా చెప్పింది. సాయిబాబా దేవుడు కాదు. మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు. ఓ వ్యక్తి గురువు కావచ్చు. సాధువు కావచ్చు గొప్ప వ్యక్తి కావచ్చు, కానీ దేవుడు కాలేడు.’’ అని వ్యాఖ్యానించారు. 

అయితే మహారాష్ట్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాధాకృష్ణ విఖే పాటిల్.. బాగేశ్వర్ ధామ్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వయం ప్రకటిత దైవం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 

నిర్మలమ్మా.. సిలిండర్ గ్యాస్ ధరలు తగ్గించరాదమ్మా.. గృహిణుల ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇదే

బాగేశ్వర్ ధామ్ సర్కార్ గా ప్రసిద్ధి చెందిన ధీరేంద్ర శాస్త్రి మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లాలోని బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి. రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ప్రాచుర్యం పొందారు. ‘కథ’ అని పిలిచే మతపరమైన ప్రసంగాల కోసం ఆయన దేశ వ్యాప్తంగా పర్యటిస్తుంటారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం