
కేరళ : జస్టిస్ తొట్టాటిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ (63) కన్నుమూశారు. న్యాయ కోవిదుడైన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కేరళ కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ సొంత రాష్ట్రమైనా కేరళ హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఛత్తీస్ గఢ్, పశ్చిమబెంగాల్ హైకోర్టులకు కూడా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.
తరువాత.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. కేరళ హైకోర్టు జడ్జిగా 2004 నుంచి 2017 వరకు సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించి శాశ్వత న్యాయమూర్తి హోదాను దక్కించుకున్నారు భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్. ఆ సమయంలోనే కేరళ హైకోర్టులో తాత్కాలిక సీజే గాను బాధ్యతలు చేపట్టారు. ఛత్తీస్ గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా 2017 మార్చిలో బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాతే అక్కడి నుంచి బదిలీ మీద హైదరాబాద్ కు వచ్చారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు.
జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. మృతుల్లో అగ్రనేతలు..?
2019 జనవరి 1 నుంచి తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయి సిజే గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే బదిలీ మీద కోల్కతా హైకోర్టుకు వెళ్లారు. భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ తల్లిదండ్రులు కూడా అడ్వకేటులే. భాస్కరన్ నాయర్, పారుకుట్టి అమ్మ అనే అడ్వకేట్ దంపతులకు కొల్లంలో భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ జన్మించారు. డిగ్రీని కోలార్ కేజిఎఫ్ లా కాలేజీలో పూర్తి చేశారు. అక్కడ లా డిగ్రీ అందుకున్న తర్వాత 1983 నుంచి తిరువనంతపురం కోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అనంతరం హైకోర్టుకు వెళ్లారు.
భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ కేరళ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ కేరళలోని మానసిక చికిత్సాలయాల పనితీరులో జోక్యం చేసుకున్న ఘటన ద్వారా బాగా జనాల్లో వినిపించారు. భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ భార్య మీర్యాసేన్. ఇద్దరు పిల్లలు పార్వతీనాయర్, కేశవరాజ్ నాయర్ ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.