
మహాత్మా గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన మహారాష్ట్ర కు చెందిన హిందుత్వ అనుకూల నేత శంభాజీ భిడే అలియాస్ మనోహర్ భిడే మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేశారు. సాయిబాబా ఆలయానికి హిందువులు వెళ్లడం మానేయాలని అన్నారు. అసలు సాయి బాబా హిందూ దేవుడు కాదని అన్నారు. హిందువులు సాయిబాబాను పూజిస్తారని, కానీ ఆయన నిజంగా అందుకు అర్హుడేనా అని పరిశీలించాలని సూచించారు.
ఒడిశాలో దారుణం.. 14 ఏళ్ల బాలుడి నరబలి.. కాళ్లు, చేతులు నరికేసి, కళ్లను కూడా..
‘‘హిందువులు ముందుగా సాయిబాబా ఫొటోలు, విగ్రహాలను ఇళ్లలో నుంచి తొలగించి పారేయాలి. నేను మానసికంగా బాగానే ఉన్నాను. ఈ విషయాన్ని బాధ్యతగా చెబుతున్నాను. సాయిబాబాను దేవుడిగా భావించకూడదు’’ అని శంభాజీ భిడే అన్నారు.
మూడు రోజుల కిందట కూడా ఆయన మహాత్మా ఫూలే, మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ, ఇటీవల సాయిబాబాపై భిడే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ ఒక ముస్లిం భూస్వామి కుమారుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ కరంచంద్ గాంధీ ఒక ముస్లిం భూస్వామి వద్ద ఉద్యోగం చేసేవాడు. ఒకరోజు కరంచంద్ గాంధీ ఆ ముస్లిం భూస్వామి నుండి పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించి పారిపోయాడు. దీంతో కోపోద్రిక్తుడైన భూస్వామి మహాత్మా గాంధీ తల్లిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను భార్యలా చూసుకున్నాడు. కాబట్టి మహాత్మా గాంధీ నిజమైన తండ్రి కరంచంద్ గాంధీ కాదు. ఆయన తండ్రి ఒక ముస్లిం భూస్వామి.’’ అని అన్నారు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు.
గంగుల కమలాకర్ ఎన్నికల వివాదం కేసు.. బండి సంజయ్ కు క్రాస్ ఎగ్జామినేషన్..
శంభాజీ వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రతిపక్షాలు దీనిపై మండిపడ్డాయి. దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీలోని రెండు వర్గాలు సోమవారం ముంబైలోని మంత్రాలయం సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపాయి. కాగా.. శంభాజీ భిడే వ్యాఖ్యలపై మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మండిపడ్డారు. జాతీయ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అయితే ఈ వివాదం ఇంకా చల్లారకముందే భిడే మరోసారి సాయిబాబాపై సంచలన ప్రకటన చేశారు.