బైక్ పై ఇద్దరు అమ్మాయిల రొమాన్స్.. వీడియో వైరల్..!

Published : Aug 01, 2023, 09:59 AM IST
బైక్ పై ఇద్దరు అమ్మాయిల రొమాన్స్.. వీడియో వైరల్..!

సారాంశం

ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి ఆ యువతులు వీడియో కోసం ప్రమాదకర సాహసం చేశారు. చూడటానికి చాలా ఇబ్బందిగా అనిపించేలా ఈ వీడియో ఉండటం విశేషం.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా  వెంటనే వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇక యువత కూడా ఏ విధంగా ఫేమస్ అయిపోదామా అని చూస్తున్నారు. దాని కోసం వెర్రి వేషాలు వేస్తున్నవారు కూడా ఉన్నారు. తాజాగా ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై దారుణంగా ప్రవర్తించారు. బైక్ పై ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ చేశారు.

ఒకరిపై మరొకరు కాళ్లు వేసుకొని కూర్చొని, కౌగిలించుకొని ముద్దులు పెట్టుకోవడం విశేషం. ఆ క్రమంలో బైక్ నడుపుతున్న యువతి హ్యాండిల్ వదిలేసి ప్రమాదకర సాహసం చేయడం గమనార్హం. ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి ఆ యువతులు వీడియో కోసం ప్రమాదకర సాహసం చేశారు. చూడటానికి చాలా ఇబ్బందిగా అనిపించేలా ఈ వీడియో ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

 

గంటా అనే ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో ఎక్కడ, ఎవరు తీశారు అనే విషయం తెలీదు కానీ, వీడియో మాత్రం వైరల్ అయ్యింది. తమిళనాడులో తీసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 80 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలను విపరీతంగా తిట్టడం గమనార్హం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !