Subrata Roy: సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత

Published : Nov 15, 2023, 03:54 AM IST
Subrata Roy: సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత

సారాంశం

Sahara Group Founder Subrata Roy: సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సుబ్రతా రాయ్ కు భార్య స్వప్న రాయ్, ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమంతో రాయ్ లు ఉండ‌గా, వారు విదేశాల్లో నివసిస్తున్నారు. 2012 లో సుబ్ర‌తా రాయ్ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన 10 మంది వ్యాపారవేత్తలలో ఒకరిగా పేరు పొందారు.  

Sahara Group Subrata Roy passes away: స‌హారా గ్రూప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో పోరాడుతూ ముంబ‌యిలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ మేర‌కు  మరణించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయ‌న వ‌య‌స్సు 75 సంవ‌త్స‌రాలు. 1948లో బీహార్‌లోని అరారియాలో ఆయ‌న‌ జన్మించారు, సహారా ఇండియా పరివార్‌ను ప్రారంభించిన సుబ్రతా రాయ్ విజయగాథ 1978లో ప్రారంభమైంది. కేవలం ₹ 2,000 మూలధనంతో ప్రారంభించి, వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచేందుకు కంపెనీ చాలా దూరం ప్రయాణించిందని సహారా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఆ తర్వాత అతని కుటుంబం బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లింది. తదనంతరం, సుబ్రతా రాయ్ 1990లలో లక్నోకు మారారు. అదే నగరాన్ని తన బృందానికి ప్రధాన కార్యాలయంగా చేసుకున్నారు. అయితే, ఇప్పుడు "సహారా చిట్ ఫండ్ స్కామ్"గా పిలవబడే కేసులో నిధుల విషయంలో సహారా అనేక సమస్యలను ఎదుర్కొంది. సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సుబ్రతా రాయ్ కు భార్య స్వప్న రాయ్, ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమంతో రాయ్ లు ఉండ‌గా, వారు విదేశాల్లో నివసిస్తున్నారు. 2012 లో సుబ్ర‌తా రాయ్ భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన 10 మంది వ్యాపారవేత్తలలో ఒకరిగా పేరు పొందారు.

మెటాస్టాటిక్ ప్రాణాంతకత, రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలతో సుదీర్ఘ పోరాటంలో కార్డియోస్పిరేటరీ అరెస్ట్‌తో సుబ్రతా రాయ్ మరణించారని సహారా బుధ‌వారం ప్రకటనలో పేర్కొంది. ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబ‌యిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. "సహారా ఇండియా పరివార్ సహరాశ్రీ వారసత్వాన్ని నిలబెట్టడానికి కట్టుబడి ఉంది. మా సంస్థను నడిపించడంలో ఆయ‌న దృష్టిని గౌరవించడం కొనసాగిస్తుంది" అని కంపెనీ తెలిపింది.

కాగా, 2012లో సహారా అక్రమ ఇన్వెస్టర్ స్కీమ్ అని సుప్రీంకోర్టు తీర్పుతో మొదలైన వ్యవహారం క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు లక్నోకు చెందిన గ్రూప్ మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించడంతో పెద్ద వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఏళ్ల తరబడి సహారా డిపాజిటర్లకు రీఫండ్ చేయమని చెప్పే వరకు కోర్టుల్లో కేసులను పోరాడింది. ఈ ఏడాది ప్రారంభంలో సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీల డిపాజిటర్లు తమ రీఫండ్ ను 45 రోజుల్లో క్లెయిమ్ చేసుకునే వెబ్సైట్ ను ప్రారంభించారు. సహారా కోఆపరేటివ్ సొసైటీల్లో పెట్టుబడులు పెట్టిన డిపాజిటర్లకు రూ.5,000 కోట్లను 'సహారా-సెబీ రీఫండ్ అకౌంట్' నుంచి సీఆర్సీఎస్ కు బదిలీ చేయాలని మార్చిలో సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ వెబ్సైట్ ను ప్రారంభించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం