Save Soil: కరీబియన్ దీవుల నుంచి లండన్‌కు చేరిన సద్గురు ప్రయాణం

Published : Mar 31, 2022, 02:50 PM ISTUpdated : Mar 31, 2022, 02:53 PM IST
Save Soil: కరీబియన్ దీవుల నుంచి లండన్‌కు చేరిన సద్గురు ప్రయాణం

సారాంశం

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ పుడమి పరిరక్షణపై అవగాహన కోసం చేపట్టిన బైక్ యాత్ర దిగ్విజయంగా సాగిపోతున్నది. ఆయన కరీబియన్ దీవుల్లో తన అవగాహన యాత్ర ముగించుకుని లండన్ చేరుకున్నారు. కరీబియ్ దీవుల్లో ఆయనకు విశేష మద్దతు లభించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇషా ఫౌండేషన్ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.

న్యూఢిల్లీ: పుడమి పరిరక్షణ అంటూ ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించిన అవగాహన యాత్ర విజయవంతంగా సాగిపోతున్నది. ఆయన కరీబియ్ దీవుల్లో ఈ అంశంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ఆయన యాత్ర కరీబియన్ దీవుల నుంచి లండన్‌కు చేరింది. కరీబియన్ దేశాల్లో ఆయన యాత్రకు విశేష మద్దతు లభించింది. సమాజంలోని అన్ని వర్గాల నుంచి సేవ్ సాయిల్ ఉద్యమానికి స్పందన లభించింది. ట్రెవర్ నోవా, జో రోగన్ వంటి మీడియా ప్రముఖులు, న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖులు, యూకే పార్లమెంట్ సభ్యులు, నేపాల్ ఎంబస్సీ నుంచి ఆయన ఉద్యమానికి మద్దతు లభించింది. పుడమి పరిరక్షణ కోసం ఆయన చేపడుతున్న అవగాహన యాత్రలో చిన్నారులు, జీవమున్న యువత కూడా చురుకుగా భాగస్వామ్యం పంచుకున్నారు. కరీబియన్ దీవుల్లో సాగిన సద్గురు సేవ్ సాయిల్ మూవ్‌మెంట్‌కు సంబంధించిన వీడియోను ఇషా ఫౌండేషన్ తన వెబ్‌సైట్‌లో వీడియో అప్‌లోడ్ చేసింది. ఆయన ప్రయాణం లండన్ చేరుకుంది.

పుడమి పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా 100 రోజుల బైక్ యాత్రను మార్చి 21వ తేదీన ప్రారంభించారు. లండన్‌లోని ట్రాఫల్‌గర్ స్క్వేర్ నుంచి ఈ బైక్ జర్నీని సోమవారం ప్రారంభించారు. ఈ ప్రయాణం 27 దేశాల గుండా 30 వేల కిలోమీటర్లు సాగనుంది. భూసారం నాణ్యతను కోల్పోయి నిస్సారంగా ఎడారిగా మారకుండా కాపాడుకోవాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ సేవ్ సాయిల్ పేరిట ఉద్యమాన్ని ప్రారంభించారు. 

ప్రపంచవ్యాప్తంగా దీనిపై అవగాహన తీసుకురావాలని ఆయన సంకల్పించారు. ఇందులో భాగంగా ఆయన ఒంటరిగా మోటార్ సైకిల్‌పై యూకే, యూరప్, పశ్చిమ దేశాల గుండా ప్రయాణించనున్నారు. చివరకు ఇండియాకు చేరుకుంటారు. కొన్ని నెలలపాటు సాగనున్న ఈ ప్రయాణంలో సద్గురు ఎంతో మంది ప్రపంచ నేతలు, మీడియా, ఇతర నిపుణులను కలుసుకుంటారు. పుడమిని రక్షించుకోవడానికి ఆయన వారితో చర్చలు జరపనున్నారు. వారు కూడా అటువైపుగా నిర్ణయాలు తీసుకోవడానికి, అడుగులు వేయడానికి ప్రోత్సహించనున్నారు.

యునైటెడ్ నేషన్స్ కాన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ ప్రకారం, 90 శాతం భూమి 2050  కల్లా నిస్సారంగా మారిపోయే ముప్పు ఉన్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం, నీటి సంక్షోభం ఏర్పడవచ్చని తెలుపుతున్నది. అంతేకాదు, భయానక కరువు కాటకాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆ రిపోర్టు తెలుపుతున్నది. ఇది మానవాళి మనుగడకే ముప్పు. కాబట్టి, ఈ ముప్పును ముందే అడ్డుకునే ప్రయత్నం చేయాలని సద్గురు భావిస్తున్నారు. 

ఈ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. నేల తల్లిని కాపాడేందుకు ఆయన చేపట్టిన ఈ ఉద్యమానికి క‌రేబియ‌న్‌ దేశాలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే ప‌లు దేశాలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. మట్టి క్షీణతను తిప్పికొడుతూ.. నేల త‌ల్లి ర‌క్ష‌ణ‌కు కృషి చేస్తూ.. దీర్ఘకాలిక ఆహారాన్ని అందించడానికి తమ దేశాలలో ఖచ్చితమైన చర్యను ప్రారంభించాలని పలు కరీబియన్ దేశాల అధినేతలు  ప్రతిజ్ఞ చేశారు. నేల తల్లిని కాపాడేందుకు ఆయన చేపట్టిన ఈ ఉద్యమానికి  ఇప్పుడు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివ్ రిచర్డ్స్ తో పాటు ఇంగ్లాండ్  లెజెండరీ క్రికెటర్ ఇయాన్ బోథమ్ లు కూడా మద్దతు పలికారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?