లగేజీ తారుమారయ్యిందని.. ఏకంగా ఇండిగో వెబ్ సైట్ ను హ్యక్ చేశాడు, సలహాలు కూడా ఇచ్చాడు...

Published : Mar 31, 2022, 02:14 PM IST
లగేజీ తారుమారయ్యిందని.. ఏకంగా ఇండిగో వెబ్ సైట్ ను హ్యక్ చేశాడు, సలహాలు కూడా ఇచ్చాడు...

సారాంశం

విమానంలో లగేజీ తారుమారయ్యింది. ఎయిర్ లైన్స్ వారిని సంప్రదిస్తే పెద్దగా స్పందన లేదు. చూస్తాం, చేస్తాం అంటారు కానీ రోజులు గడుస్తున్నా లగేజీ జాడ తెలియలేదు. దీంతో ఓ టెకీ ఏకంగా ఇండిగో ఎయిర్ లైన్స్ వెబ్ సైట్ నే హ్యాక్ చేశారు. 

బెంగళూరు : పాట్నా నుంచి Bengaluru వచ్చిన IndiGo విమానంలో ఇద్దరు ప్రయాణికుల luggage బ్యాగులు తారుమారయ్యాయి. వీరిద్దరి బ్యాగులు దాదాపు ఒకే విధంగా ఉండటంతో ఆ ఇద్దరు ఇబ్బంది పడ్డారు. Customer careనుంచి సరైన సహకారం అందకపోవడంతో ఆ ఇద్దరిలో ఒకరు తన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి,  తన బ్యాగును తాను పొందగలగడంతో పాటు, ఇండిగోకు మంచి సలహాలు కూడా ఇచ్చారు. ఇటువంటి అసౌకర్యం కలిగినందుకు  ఎయిర్ లైన్స్ విచారం వ్యక్తం చేస్తూ, లోపాలను సరిదిద్దుతామని హామీ ఇచ్చింది.

సాఫ్ట్వేర్ ఇంజనీర్ నందకుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన మార్చి 27న ఇండిగో 6ఈ-185 విమానంలో  పాట్నా నుంచి బెంగళూరుకు వెళ్లారు. ఆయన లగేజీని పొరపాటున సహా ప్రయాణికుడు తీసుకెళ్లాడు.  సహ ప్రయాణికుడి లగేజీని  నందన్ తీసుకొచ్చారు. ఇలా బ్యాగులు మారడంలో ఇరువురి పొరపాటు లేదు . ఆ రెండు బ్యాగులు దాదాపు ఒకే విధంగా ఉండటంతో ఇలా జరిగింది.

ఇంటికి వెళ్ళిన తర్వాత నందన్ కుమార్ భార్య ఆ బ్యాగును బాగా పరిశీలించి ఇది మన బ్యాగు కాదని చెప్పింది. మనం తాళం కప్పలను వాడం కదా?  అన్నది. దీంతో జరిగిన పొరపాటును గుర్తించారు. ఆ తర్వాత ఆయన ఇండిగో కస్టమర్ కేర్ సంప్రదించారు. ఒకరోజు వేచి చూసినప్పటికీ కస్టమర్ కేర్ నుంచి సరైన సమాధానం రాలేదు.  తన బ్యాగ్ ను పట్టి కెళ్లిన వ్యక్తికి సంబంధించిన వివరాలను ఇవ్వడానికి ముందుకు రాలేదు. వ్యక్తిగత గోప్యత, డేటా ప్రొటెక్షన్ అంటూ సాకులు చెప్పారు. ఆ మర్నాడు కూడా కస్టమర్ కేర్ నుంచి ఫోన్ రాలేదు. అయితే ఏజెంట్ మాత్రం హామీ ఇచ్చారు.  ఆ బ్యాగ్ ను  పట్టుకెళ్ళిన  వ్యక్తి సమాచారం దొరికిన వెంటనే ఫోన్ చేస్తామని చెప్పారు. ఎంతకీ ఫోన్ రాకపోవడంతో కుమార్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు.

@IndiGo6E  వెబ్ సైట్ ను  తెరిచి F12 బటన్ను నొక్కి,  చెక్-ఇన్ ఫ్లోను, నెట్వర్క్ లాగ్ రికార్డును చూశారు. కావలసిన సమాచారం సేకరించారు. తన బ్యాగు పట్టుకెల్లిన సహ ప్రయాణికుడి పిఎన్ఆర్ నెంబర్ తాను తీసుకొచ్చిన బ్యాగుపై ఉండడంతో దాని ఆధారంగా కొంత ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఆ సహా ప్రయాణికుడి సమాచారం, ఫోన్ నెంబర్ తెలుసుకున్నారు. అదృష్టవశాత్తు వీరిద్దరూ దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. తాను తీసుకొచ్చిన బ్యాగును ఆయనకు ఇచ్చేసి, తన బ్యాగును తిరిగి తీసుకున్నారు.

ఇండిగో ఎయిర్ లైన్స్ ను కూడా కొన్ని సూచనలు చేశారు. IVRను పిక్స్ చేసుకోవాలని, మరింత యూజర్ ఫ్రెండ్లీ గా మార్చాలని  తెలిపారు. కస్టమర్ కేర్ సేవలు చురుగ్గా ఉండేలా చూడాలని, యాక్టివ్ గా ఉండేలా చేయొద్దని చెప్పారు. సున్నితమైన సమాచారాన్ని ఈ వెబ్సైట్ లీక్ చేస్తోందని దీని సరిదిద్దాలని సూచించారు.  దీనిపై ఇండిగో స్పందిస్తూ, నందన్ కుమార్ కు జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. సెక్యూరిటీ  లోపాలు లేకుండా జాగ్రత్త వహిస్తాం అని హామీ ఇచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu