రాజస్థాన్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సంక్షోభం: బల నిరూపణ చేసుకోవాలని సచిన్ వర్గం డిమాండ్

By narsimha lodeFirst Published Jul 14, 2020, 11:20 AM IST
Highlights

 రాజస్థాన్ రాష్ట కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ జైపూర్ లోని ఫెయిర్ మౌంట్ రిసార్ట్స్ లో సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తాము హాజరుకావడం లేదని సచిన్ పైలెట్ వర్గ ఎమ్మెల్యేలు ప్రకటించారు.


జైపూర్: రాజస్థాన్ రాష్ట కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ జైపూర్ లోని ఫెయిర్ మౌంట్ రిసార్ట్స్ లో సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తాము హాజరుకావడం లేదని సచిన్ పైలెట్ వర్గ ఎమ్మెల్యేలు ప్రకటించారు.

సోమవారం నాడు సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలను నేరుగా ఫెయిర్ మౌంట్ రిసార్ట్స్ కు తరలించారు.ఈ రిసార్ట్స్  నుండి 22 మంది ఎమ్మెల్యేలు కన్పించకుండా పోయారని ప్రచారం సాగుతోంది. 

సచిన్ పైలెట్ వర్గీయుడిగా ముద్రపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని సీఎం ఆశోక్ గెహ్లాట్ ను డిమాండ్ చేశారు.

also read:రిసార్ట్స్‌కు గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు: సచిన్ పైలెట్‌తో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు

న్యూఢిల్లీలో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన ప్రకటించారు. అంతేకాదు సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలెట్ హాజరు కారని ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రకటించారు.

సీఎల్పీ సమావేశం జరిగే రిసార్ట్స్ కు సమీపంలో రోడ్లపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.మరోవైపు సచిన్ పైలెట్ తనతో ఉన్న ఎమ్మెల్యేలతో ఓ వీడియోను విడుదల చేశాడు.  రాజస్థాన్ లో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.

సచిన్ పైలెట్ తో రాహుల్ , ప్రియాంక గాంధీలతో  పాటు చిదంబరం, అహ్మద్ పటేల్, వేణుగోపాల్ చర్చలు జరిపారు.


 

click me!