కరోనాతో 23,727 మంది మృతి: ఇండియాలో 9 లక్షలు దాటిన కేసులు

By narsimha lode  |  First Published Jul 14, 2020, 10:33 AM IST

 గత 24 గంటల్లో దేశంలో 28,498 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో కరోనా కేసుల సంఖ్య 9,06,752కి చేరుకొంది. ఇందులో 3,11,565 యాక్టివ్ కేసులు. కరోనా సోకిన 5,71,460 మంది కోలుకొన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది.


న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశంలో 28,498 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో కరోనా కేసుల సంఖ్య 9,06,752కి చేరుకొంది. ఇందులో 3,11,565 యాక్టివ్ కేసులు. కరోనా సోకిన 5,71,460 మంది కోలుకొన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది.

గత 24 గంటల్లో 553 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 23,727 మంది మృతి చెందినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుండి రుద్రపూర్, బాజపూర్, ఉద్దంసింగ్ నగర్ జిల్లాల్లో  మూడు రోజుల పాటు లాక్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం విధించింది.

Latest Videos

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నాడు కొత్త క్వారంటైన్ నిబంధనలు విడుదల చేసింది.తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హై రిస్క్ ప్రాంతాలుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

జమ్మూ కాశ్మీర్ లో 10,827 కి కరోనా కేసులు చేరుకొన్నాయి. సోమవారం నాడు 8 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 187కి చేరుకొంది.యాక్టివ్ కేసుల సంఖ్య 4,545గా నమోదైంది.

కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా 2738 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 40 వేలకు చేరుకొంది. సోమవారం నాడు ఒక్క రోజే రాష్ట్రంలో 73 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 757కి చేరుకొంది.రాష్ట్రంలో 24,572కి యాక్టివ్ కేసులు చేరుకొన్నాయి.

బీహార్ రాష్ట్రంలోని బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ కు కరోనా సోకింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సుమారు 90 మంది బీజేపీ నేతల నుండి శాంపిల్స్ ను సేకరించారు.

click me!