
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. కేంద్రం ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ స్ఫూర్తి, సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం 'అమృత్ కాల్' శకానికి ఎలా నాంది పలికిందో భారత ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఒక అద్భుతమైన సారాంశం అని అన్నారు. ఇదో కేవలం నినాదం మాత్రమే కాదని అన్నారు. భారతదేశాన్ని, మన ఆర్థిక వ్యవస్థను గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా మార్చివేసిన నిజమైన పాలనా భావజాలం అని చెప్పారు.
పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు - నిర్మలా సీతారామన్
ఈ ఊపు 2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నుకునేందుకు మరో ఏకాభిప్రాయం దిశగా అందరినీ నడిపిస్తుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దశాబ్దం పాటు నిర్మాణాత్మక పరివర్తన తర్వాత నేడు మనం బలమైన పునాదిపై కూర్చున్నామని అన్నారు. 2014 లో 'బలహీనమైన ఐదు' ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా ఉందని ఆయన గుర్తు చేశారు.
Union Budget 2024 : 57 నిమిషాలే మాట్లాడిన నిర్మలా సీతారామన్.. అతి చిన్న ప్రసంగంగా రికార్డ్
కానీ నేడు బలమైన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారిందని చెప్పారు. మన దేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా వేగంగా కదులుతోందని అన్నారు. మహిళలు, రైతులు, యువ భారతీయులు, పేదలు అనే నాలుగు స్తంభాలను శక్తివంతం చేయడం ద్వారా, ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్ష్యం, విజన్ అయిన 'విక్షిత్ భారత్ 2047' కలను సాకారం చేసే మార్గంలో ఉన్నామని అన్నారు.
Budget 2024: 'గేమ్-ఛేంజర్' ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ కథేంటో తెలుసా?
గత పదేళ్లుగా సాధించిన విజయాల పీఠంపై నిలుచుని, 'సబ్ కా ప్రయాస్', ఫ్యూచరిస్టిక్ గవర్నెన్స్ మోడల్ సాయంతో మన దేశాన్ని మన జీవితకాలంలో అభివృద్ధి చెందిన భారత్ గా తీర్చిదిద్దగలమని తాను విశ్వసిస్తున్నానని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు.