
రూపే, యూపీఐ టెక్నాలజీలు ప్రపంచంలోనే భారత్‌కు గుర్తింపు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇండస్ట్రీ 4.0 యుగంలో భారతదేశం అభివృద్ధి చేసిన వేదికలు ప్రపంచానికి ఆదర్శంగా మారుతున్నాయని తెలిపారు. ‘వృద్ధి అవకాశాలను సృష్టించడానికి ఆర్థిక సేవల సామర్థ్యాన్ని పెంచడం’ అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్ లో మంగళవారం ప్రధాని మోడీ ప్రసంగించారు.
పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు..
ప్రభుత్వం నిర్వహిస్తున్న 12 వెబినార్ల సిరీస్ లో ఇది పదోది. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆలోచనలు, సలహాలు తీసుకోవడమే వెబినార్ల నిర్వహణ వెనుక ఉద్దేశం. కాగా.. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. రూపే, యూపీఐలు తక్కువ ఖర్చుతో కూడిన, అత్యంత సురక్షితమైన టెక్నాలజీలు మాత్రమే కాదని, ఇది ప్రపంచంలో మన గుర్తింపు అని అన్నారు. ‘‘ ఇన్నోవేషన్ కు అపార అవకాశాలున్నాయి. యూపీఐ మొత్తం ప్రపంచానికి ఆర్థిక సమ్మిళిత, సాధికారత సాధనంగా మారాలి. దాని కోసం మనం సమిష్టిగా పనిచేయాలి. మన ఆర్థిక సంస్థలు కూడా తమ పరిధిని పెంచుకోవడానికి ఫిన్‌టెక్‌తో గరిష్ట భాగస్వామ్యం కలిగి ఉండాలని నేను సూచిస్తున్నాను’’ అని ప్రధాని మోడీ అన్నారు.
గుజరాత్ యూనివర్సిటీలో అఫ్గాన్ మహిళకు ఎంఏ గోల్డ్ మెడల్.. ‘తాలిబాన్‌లకు నా సమాధానమిదే’
ఫిన్‌టెక్ ఇన్నోవేషన్ కోసం భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది. భారతదేశం డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాల ప్రపంచీకరణను నడిపించడంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. యూపీఐ ప్రయోజనాలు భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా, ఇతర దేశాలు కూడా దాని నుండి లాభం పొందేలా చూడటం ప్రధాని మోడీ ప్రధాన ప్రాధాన్యత.
కాగా.. భారత్, సింగపూర్ గత నెలలో తమ ఆన్ లైన్ పేమెంట్స్ వ్యవస్థలైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), సింగపూర్ కు చెందిన పేనౌలను అనుసంధానించాయి. వర్చువల్ లాంచ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాని లీ సియెన్ లూంగ్ ఇందులో పాల్గొన్నారు. ఇరు దేశాలకు చెందిన ఈ రెండు చెల్లింపు వ్యవస్థల అనుసంధానం వల్ల రెండు దేశాల పౌరులు బార్డర్ రెమిటెన్స్ లను వేగంగా, మరింత తక్కువ ఖర్చుతో బదిలీ చేయడానికి వీలు కలుగుతుంది. రెండు దేశాల ప్రజలు క్యూఆర్ కోడ్ ఆధారిత లేదా బ్యాంకు ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్లను ఉపయోగించి రియల్ టైమ్ లో డబ్బు పంపవచ్చు.
కవిత ప్రతినిధిగా రామచంద్ర పిళ్లై: ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈడి
యూపీఐ చెల్లింపు వ్యవస్థ ప్రజాదరణను పరిగణనలోకి తీసుకొని భారతదేశానికి వచ్చే ప్రయాణికులందరూ దేశంలో ఉన్నప్పుడు వారి మర్చంట్ చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగించడానికి అనుమతించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. భారతదేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపులకు యూపీఐ చెల్లింపుల వ్యవస్థ బాగా ప్రాచుర్యం పొందింది. దాని స్వీకరణ వేగంగా పెరుగుతోంది. తొలుత జీ-20 దేశాల ప్రయాణికులకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు.