పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు..

Published : Mar 07, 2023, 03:13 PM IST
పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు..

సారాంశం

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధరంపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం ధరంపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వలస కూలీలుగా గుర్తించారు. వారు వలసకూలీలుగా హిమాచల్‌ప్రదేశ్‌కు వచ్చారు. వివరాలు.. సిమ్లా-చండీగఢ్ హైవేపై ధరంపూర్ సమీపంలో ఉదయం 9.20 గంటలకు పని కోసం నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. స్థానికులతో కలిసి గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని గుడ్డు యాదవ్, రాజా వర్మ, నిషాద్, మోతీలాల్ యాదవ్, సన్నీ గుర్తించినట్టుగా  పోలీసులు తెలిపారు. గాయపడిన నలుగురికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుందని  చెప్పారు.  కారు డ్రైవర్ రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. 

ఇక, డ్రైవర్ నిర్లక్ష్యంగా కారును నడిపాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. అయితే డ్రైవరు మద్యం తాగి ఉన్నారా, అతనికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదా? అనే విషయాలు ఇంకా నిర్ధారించబడలేదు.
 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !