హాట్ టాపిక్: బిజెపిలోకి సినీ నటుడు బ్రహ్మానందం?

Published : Dec 02, 2019, 07:00 AM ISTUpdated : Dec 02, 2019, 07:03 AM IST
హాట్ టాపిక్: బిజెపిలోకి సినీ నటుడు బ్రహ్మానందం?

సారాంశం

ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు బ్రహ్మానందం రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ప్రచారం సాగుతోంది. బ్రహ్మాానందం చిక్కబళ్లాపురలో బిజెపి అభ్యర్థి సుధాకర్ తరఫున ప్రచారం చేశారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

బెంగళూరు: ప్రముఖ సనీ నటుడు బ్రహ్మానందం రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కర్ణాటకలోని ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయడంతో ఆ ప్రచారానికి రెక్కలు వచ్చాయి. ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులోని చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి డాక్టర్ సుధాకర్ మద్దతుగా ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన రోడ్ షో చేశారు. దాంతో ఆయన బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. 

Also Read:నిజం...కర్ణాటకలో బ్రహ్మీ వల్ల ట్రాఫిక్ జామ్.

చిక్కబళ్లాపుర, బాగేపల్లి, గౌరిబిడనూరు నియోజకవర్గాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు. తెలుగు సినీ నటుల ప్రభావం కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువే. దీంతో బిజెపి తరఫున బ్రహ్మానందం ప్రచారం చేశఆరు. 

2018 ఎన్నికల్లో చిక్కబళ్లాపుర అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కిరణ్ తరఫున జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. తన రాజకీయ ప్రవేశంపై బ్రహ్మానందం చెప్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్