బిజెపిలో చేరిన హీరోయిన్ నమిత: రాధారవి చేరికపై చిన్మయి ఫైర్

Published : Dec 01, 2019, 07:29 AM IST
బిజెపిలో చేరిన హీరోయిన్ నమిత: రాధారవి చేరికపై చిన్మయి ఫైర్

సారాంశం

ప్రముఖ సినీ నటి నమిత జెపి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరారు. ఆమె ఇప్పటి వరకు తమిళనాడులో అన్నాడియంకె కోసం పనిచేశారు. పెళ్లి తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నమిత తెలుగు సినిమాల్లో కూడా నటించారు.

చెన్నై: ప్రముఖ సినీ నటి నమిత బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో ఆమె కమలం తీర్థం పుచ్చుకున్నారు.నడ్డా కాషాయం కండువా కప్పి ఆమెను పార్లీలోకి ఆహ్వానించారు. 

తెలుగు, తమిళ సినిమాల్లో నమిత నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు హీరో బాలకృష్ణ సరసన సింహా సినిమాలోనూ వెంకటేష్ నటించిన జెమిని సినిమాలోనూ ఆమె నటించారు 

పెళ్లి చేసుకున్న తర్వాత నమిత రాజకీయాల్లోకి ప్రవేశించారు తమిళనాడులో ఆమె అన్నాడియంకె కోసం ఆమె పనిచేశారు తాజాగా, ఆ పార్టీ నుంచి తప్పుకుని బిజెపిలో చేరారు.

కాగా, రాధారవి కూడా బిజెపిలో చేరారు. రాధా రవిని పార్టీలో చేర్చుకోవడంపై చిన్మయి మండిపడ్డారు. మహిళలపై గౌరవం లేని రాధారవిని బిజెపిలో చేర్చుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. 

 

PREV
click me!

Recommended Stories

International Flower Show: ఎన్నడూ చూడని రకాల పూలతో అంతర్జాతీయ పుష్ప ప్రదర్శన | Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?