ముస్లిం మహిళలపై అభ్యంతరకర పోస్టు.. ఆరెస్సెస్ కార్యకర్త అరెస్ట్

By Mahesh RajamoniFirst Published Jun 2, 2023, 11:51 AM IST
Highlights

Raichur: కర్ణాటకలో ముస్లిం మహిళలపై అభ్యంతరకర పోస్టు పెట్టిన ఆరెస్సెస్ కార్యకర్త అరెస్టు అయ్యారు. ముస్లిం మహిళలను పిల్లలను ఉత్పత్తి చేసే యంత్రాలుగా చూపిస్తూ నిందితులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే వారిపై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు పేర్కొన్నారు. 
 

RSS worker arrested for objectionable post against Muslim: కర్ణాటకలో ముస్లిం మహిళలపై అభ్యంతరకర పోస్టు పెట్టిన ఆరెస్సెస్ కార్యకర్త అరెస్టు అయ్యారు. ముస్లిం మహిళలను పిల్లలను ఉత్పత్తి చేసే యంత్రాలుగా చూపిస్తూ నిందితులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే వారిపై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు పేర్కొన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. రాయచూర్ జిల్లాలో ముస్లిం మహిళలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన ఆరెస్సెస్ కార్యకర్తను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ అభ్యంతరకర పోస్టులు వైరల్ కావడంతో ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సంఘాలు గురువారం ఆందోళనకు దిగాయి. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించి నిందితులను అరెస్టు చేయడానికి 24 గంటల గడువు ఇచ్చారు. వారిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఆందోళ‌న‌ను ఉధృతం చేస్తామ‌ని తెలిపారు. 

అరెస్టయిన ఆరెస్సెస్ కార్యకర్తను రాజు తాంబక్ గా గుర్తించారు. ముస్లిం మహిళలను పిల్లలను ఉత్పత్తి చేసే యంత్రాలుగా చూపిస్తూ నిందితులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని పోలీసులు తెలిపారు. రాజు తంబక్ తమ మత మనోభావాలను దెబ్బతీశారనీ, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ముస్లిం సమాజం లింగసుగూరు పోలీసులను డిమాండ్ చేసింది. ఈ ఘటనతో లింగసుగూరు పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేసు న‌మోదుచేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌ల‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

click me!