ఆర్‌ఎస్‌ఎస్‌ బ్రిటీష్ వారికి సాయం చేసింది.. సావర్కర్ వారి నుంచి స్టైఫండ్ తీసుకున్నారు: రాహుల్ గాంధీ

By Sumanth KanukulaFirst Published Oct 8, 2022, 5:45 PM IST
Highlights

ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ బ్రిటీష్ వారితో ఉందని ఆరోపించారు. వీడీ సావర్కర్ బ్రిటిష్ వారి నుంచి స్టైఫండ్ తీసుకున్నారని అన్నారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ బ్రిటీష్ వారితో ఉందని ఆరోపించారు. వీడీ సావర్కర్ బ్రిటిష్ వారి నుంచి స్టైఫండ్ తీసుకున్నారని అన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో సాగుతున్న సంగతి తెలిసిందే. నేడు మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దేశ విభజనకు కాంగ్రెస్‌దే బాధ్యత అని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. కాంగ్రెస్‌ నాయకులు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడి ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపారని అన్నారు. 

“చరిత్రపై నాకున్న అవగాహన ప్రకారం.. ఆర్‌ఎస్‌ఎస్ బ్రిటిష్ వారికి సహాయం చేసింది. సావర్కర్ బ్రిటిష్ వారి నుంచి స్టైఫండ్ పొందారు. ఇవి చారిత్రక వాస్తవాలు’’ అని రాహుల్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, దేశానికి రాజ్యాంగాన్ని అందించి హరిత విప్లవానికి నాంది పలికింది కాంగ్రెస్సే అని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ ఎక్కడా లేదని విమర్శించారు. బీజేపీ ద్వేషాన్ని వ్యాపింపజేసి దేశాన్ని విడదీస్తోందని ఆరోపించారు. 

Also Read: కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడిని గాంధీ కుటుంబం కంట్రోల్ చేయ‌దు - రాహుల్ గాంధీ


మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. సంవత్సరాలుగా రాజకీయ నాయకులకు, పౌరులకు మధ్య దూరం ఏర్పడిందని అన్నారు. ‘‘ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. నేను తపస్సును నమ్ముతాను. నా కుటుంబం తపస్సును నమ్ముతుంది. అందువల్ల మేము రోడ్డుపై పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాం. మీరు రోడ్డు మీద నడిచి, ప్రజలతో మాట్లాడినప్పుడు, కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది. నాకు ఇది ఒక అభ్యాస అనుభవం. ఇప్పటికి 31 రోజులు మాత్రమే అయింది. ఈ కమ్యూనికేషన్ మోడ్ యొక్క ప్రయోజనాలను నేను ఇప్పటికే చూస్తున్నాను’’ అని అన్నారు. 
 

click me!