భారీ అగ్నిప్రమాదం..  బాల్క‌నీలో వేలాడుతూ.. ర‌క్షించ‌మ‌ని వేడుకోలు.. 

Published : Oct 08, 2022, 04:45 PM IST
భారీ అగ్నిప్రమాదం..  బాల్క‌నీలో వేలాడుతూ.. ర‌క్షించ‌మ‌ని వేడుకోలు.. 

సారాంశం

ముంబైలోని తిలక్ నగర్‌లో ఉన్న 13 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప‌లువురు ఆ మంట‌ల్లో చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది

దేశ ఆర్థిక రాజధాని, మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న‌గరంలోని ముంబైలోని తిలక్ నగర్‌లో ఉన్న ఓ బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నంలో మంటలు చెలరేగాయి, చాలా మంది నివాసితులు బాల్క‌నీలో వేలాడుతూ.. తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ త‌రుణంలో త‌మ‌ని కాపాడ‌మని అక్క‌డి వారిని వేడుకున్నారు.  అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించింది

వివ‌రాల్లోకెళ్తే.. చెంబూర్‌లోని న్యూ తిలక్ నగర్ ప్రాంతంలోని బ‌హుళ‌ అంతస్తుల నివాస భవనంలో శ‌నివారం మ‌ధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ భవనంలోని 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి, ఈ కారణంగా ఈ భవనంలో నివసిస్తున్న చాలా మంది భవనంలో చిక్కుకున్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  . 

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. 12వ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి.  మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముంబై అగ్నిమాపక దళం (MFB) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంటలను అదుపు చేసేందుకు కనీసం 8 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి.  ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2:43 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందిందని తెలిపారు.

మంటలు చెలరేగడంతో భవనంలో ఉన్న నివాసితులు సురక్షితంగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఈ క్ర‌మంలో కొంద‌రూ నివాసితులు బాల్క‌నీలో వేలాడుతూ.. తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ త‌రుణంలో త‌మ‌ని కాపాడ‌మని అధికారులను  వేడుకున్నారు. భవనం విజువల్స్ చూస్తే.. చాలా మంది చేతులు ఊపుతూ రక్షించాలంటూ వేడుకుంటున్న దృశ్యం క‌నిపిస్తుంది. 

 

PREV
click me!

Recommended Stories

Modi Speech on Delimitation in Parliament డీ లిమిటేషన్ పైపార్లమెంటులో మోదీ స్పీచ్ | Asianet Telugu
ఆడపిల్లల్ని కూడా వదల్లేదు బైరెడ్డి శబరి స్పీచ్ కి దద్దరిల్లిన పార్లమెంట్| Asianet News Telugu