రోడ్డుపై రెండు రూ.500 నోట్లు: ముట్టుకోని జనం.. రంగంలోకి పోలీసులు

By Siva KodatiFirst Published Apr 10, 2020, 4:04 PM IST
Highlights

మామూలుగా అయితే రోడ్డుపై కరెన్సీ నోటు కనిపిస్తే ఏం చేస్తాం... ఎవరూ చూడకుండా దానిని జేబులో పెట్టుకుంటాం. కొందరు పుణ్యాత్ములైతే అవి ఎవరివో కనుక్కుని వాళ్లకి ఇచ్చేస్తారు. కానీ లక్నోలో మాత్రం అలా జరగలేదు.

మామూలుగా అయితే రోడ్డుపై కరెన్సీ నోటు కనిపిస్తే ఏం చేస్తాం... ఎవరూ చూడకుండా దానిని జేబులో పెట్టుకుంటాం. కొందరు పుణ్యాత్ములైతే అవి ఎవరివో కనుక్కుని వాళ్లకి ఇచ్చేస్తారు. కానీ లక్నోలో మాత్రం అలా జరగలేదు.

రోడ్డుపై పడివున్న రెండు రూ. 500 నోట్లను తీసుకునేందుకు జనం ఎవ్వరూ ముందుకు రాలేదు. పైగా భయంతో దూరం జరిగారు కూడా. దీనికి కారణం ఏంటో తెలుసా కరోనా వైరస్. కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వ్యాపిస్తుందని సోషల్ మీడియాలో కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే ఇప్పుడు వారి భయానికి కారణమై ఉండొచ్చు.

Latest Videos

Also Read:కరోనాతో మృతి: అంత్యక్రియలకు అడ్డుపడ్డ జనం... కేసులు పెట్టిన పోలీసులు

వివరాల్లోకి వెళితే.. లక్నోలోని పేపర్ మిల్ కాలనీలో గురువారం రాత్రి స్థానికులు రోడ్డుపై రూ.500 నోట్లు రోడ్డుపై గమనించారు. వాటిని తీసుకోవడానికి బదులు వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

తమ ప్రాంతంలో కరోనా వైరస్‌ను వ్యాప్తి చేయడానికే ఎవరో వాటిని ఇక్కడ పడేశారన్న అనుమానంతో జనం భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుని, అందరినీ ఇళ్లకు, వెళ్లిపోవాలని సూచించారు. అలాగే దగ్గరలోని వైద్యుడి వద్దకు వెళ్లి విషయం చెప్పగా.. 24 గంటల పాటు వాటిని ముట్టుకోకుండా వేరుగా ఉంచాలని సూచించారు.

Also Read:చెట్టు కింద ప్లీడర్ కాదు.. చెట్టు పైన ప్లీడర్..!

ఈ విషయం ఆ నోటా ఈ నోటా మీడియా దాకా వెళ్లడంతో ఆ ప్రాంతాన్ని విలేకర్లు చుట్టుముట్టారు. దీనిపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటమే జనం భయానికి కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఇంత కలకలానికి కారణమైన రెండు రూ.500 నోట్లు తమ వద్దే ఉన్నాయని చెప్పారు. 

click me!