కరోనాతో మృతి: అంత్యక్రియలకు అడ్డుపడ్డ జనం... కేసులు పెట్టిన పోలీసులు

By Siva KodatiFirst Published Apr 10, 2020, 2:44 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో సామాజిక పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఎదుటి మనిషి తుమ్మినా, దగ్గినా ఏదో అయిపోతుందని భయం. దీంతో వారిని అంటరానివారుగా చూస్తున్నారు

కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో సామాజిక పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఎదుటి మనిషి తుమ్మినా, దగ్గినా ఏదో అయిపోతుందని భయం. దీంతో వారిని అంటరానివారుగా చూస్తున్నారు. వీరి పరిస్ధితే ఇలా వుంటే కరోనా సోకిన వారి సంగతి చెప్కక్కర్లేదు.

తాజాగా పంజాబ్‌లోని జలంధర్‌లో అచ్చం ఇలాంటి ఘటనే ఎదురైంది. నగరంలోని  ఓ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో అతను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు  నిర్వహించిన డాక్టర్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అతనికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారించారు.

Also Read:చెట్టు కింద ప్లీడర్ కాదు.. చెట్టు పైన ప్లీడర్..!

అప్పటికే ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై వుంచి చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయాడు. కరోనా సోకి మరణించడంతో మృతుడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ఈ సమయంలో కరోనా సోకిన వ్యక్తికి తమ ప్రదేశంలో అంత్యక్రియలు  నిర్వహించొద్దని స్థానికులు నిరసనకు దిగడంతో పాటు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారులు, పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అంత్యక్రియలకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు.

దీంతో ఓపిక నశించిన పోలీసులు వారి చర్యను తీవ్రంగా పరిగణించారు. అంత్యక్రియలను అడ్డుకుంటే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతో అంత్యక్రియలకు ఆటంకం కలిగించిన దాదాపు 60 మందిపై కేసులు నమోదు చేశారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్ జరుపుకొన్న జంట

నగరంలో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠినంగా వ్యవహరిస్తామని జలంధర్ పోలీస్ కమీషనర్ గురుప్రీత్ సింగ్ హెచ్చరించారు. కాగా పంజాబ్‌లో పలుచోట్ల ఇప్పటికే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

వైరస్ సోకి మరణించిన వారి అంత్యక్రియలు తమ ప్రాంతంలో నిర్వహిస్తే తమకు కూడా కోవిడ్ సోకుతుందని అపోహ పడుతున్నారు. వీరికి ఉన్నతాధికారులు, మంత్రులతో పాటు పలువురు రాజకీయ నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
 

click me!