కొడుకు మృత‌దేహం ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్.. బిచ్చ‌మెత్తుకున్న వృద్ధ దంప‌తులు.. వీడియో వైర‌ల్

Published : Jun 09, 2022, 02:37 AM ISTUpdated : Jun 09, 2022, 02:38 AM IST
కొడుకు మృత‌దేహం ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్.. బిచ్చ‌మెత్తుకున్న వృద్ధ దంప‌తులు.. వీడియో వైర‌ల్

సారాంశం

బీహార్ లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో ఓ వృద్ధ దంప‌తులు ఇంటింటికీ తిరుగుతూ యాచిస్తున్నారు. వారి కుమారుడు శవాన్ని హాస్పిటల్ నుంచి విడుదల చేసేందుకు సిబ్బంది డబ్బులు అడగడంతో.. వేేరే దారిలేక బిచ్చమెత్తుకున్నారు. 

ఆ వృద్ధ దంప‌తుల కుమారుడు కొన్ని రోజుల కింద‌ట క‌నిపించ‌కుండా పోయాడు. అత‌డి కోసం చాలా చోట్ల గాలించారు. అయినా జాడ దొర‌క‌లేదు. చివ‌రికి ఓ హస్పిట‌ల్ నుంచి వారికి కాల్ వ‌చ్చింది. కుమారుడి మృత‌దేహం త‌మ హాస్పిటల్ లో ఉంద‌ని, అయితే దానిని అప్ప‌జెప్పాలంటే రూ.50 వేలు డ‌బ్బులు చేశారు. అస‌లే పేద వారు, పైగా వృద్ధులైన ఆ దంప‌తులు ఆ డ‌బ్బును ఎక్క‌డి నుంచి తీసుకొస్తారు. ఆ డ‌బ్బును సంపాదించడం కోసం వారు బిచ్చ‌మెత్తుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అనుకున్న ప్రకార‌మే యాచించ‌డం మొద‌లు పెట్టారు. ఈ ఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

‘‘ చ‌దువుకోవ‌డం ముఖ్య‌మా ? హిజాబ్ ధ‌రించ‌డం ముఖ్య‌మా ?’’ - క‌ర్నాట‌క బీజేపీ ఎమ్మెల్యే సంజీవ మాతండూరు

మ‌నుషులు హృదయాన్ని ద్ర‌వింప‌జేసే వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ వృద్ధ జంట బీహార్‌లోని సమస్తిపూర్ నగరంలోని వీధుల్లో తిరుగుతూ యాచిస్తోంది. “ తమ కుమారుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుండి విడుదల చేయడానికి డబ్బు ఏర్పాటు చేయాలంటూ ’’ వేడుకుంటోంది. కుమారుడి మృతదేహాన్ని విడిపించేందుకు సదర్ హాస్పిటల్‌లోని ఒక ఉద్యోగి రూ. 50,000 చెల్లించాలని కోరాడని, దీంతో తాము బలవంతంగా ఈ ప‌ని చేయాల్సి వ‌స్తోంద‌ని వృద్ధ దంప‌తులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మారుస్తా.. తండ్రి మాటను నెర‌వేరుస్తా - ఉద్ధవ్ ఠాక్రే

ఈ ఘ‌ట‌న విష‌యంలో మృతుడి తండ్రి మహేష్ ఠాకూర్ వార్తా సంస్థ ANIతో మాట్లాడారు. ‘‘ కొంత కాలం క్రితం నా కొడుకు కనిపించకుండా పోయాడు. అతడి కోసం పలు చోట్ల వెతికాం. అయినా కనిపించలేదు. అయితే నా కొడుకు మృతదేహం సమస్తిపూర్‌లోని సదర్ ఆసుపత్రిలో ఉందని మాకు కాల్ వచ్చింది. నా కుమారుడి మృతదేహాన్ని విడుదల చేసేందుకు ఆస్పత్రి ఉద్యోగి రూ.50 వేలు అడిగాడు. మేం పేదవాళ్లం, ఇంత మొత్తం ఎలా చెల్లించాలి? అందుకే ఈ ప‌ని చేస్తున్నాం ’’ అని ఆయ‌న అన్నారు. 

Muhammad Prophet Row: ప్రధాని చర్యలు తీసుకోవాలి.. విద్వేష విషాన్ని ఆపాలి: మోడీకి నసీరుద్దీన్ షా విజ్ఞప్తి

ఈ విషయం సంచ‌ల‌నం సృష్టించ‌డంతో సమస్తిపూర్‌ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎస్‌కే చౌదరి స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. “ ఈ విషయంలో మేము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. బాధ్యులుగా గుర్తించిన వారిని విడిచిపెట్టబోమం ’’ అని ఆయన అన్నారు. అయితే ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చిన ప్రాంతంలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలే ఇలాంటి డ‌బ్బు డిమాండ్ కు కార‌ణం అయ్యాయ‌ని స్థానిక మీడియా క‌థ‌నాల ద్వారా తెలుస్తోంది. ఈ హాస్పిట‌ల్ లో చాలా మంది ఆరోగ్య కార్యకర్తలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. అనేక సార్లు వారికి జీతాలు రావడం లేదు. అందుకే రోగుల బంధువులను డబ్బులు అడుగుతున్నార‌ని తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?