మత్స్యకారులకు రూ. 20 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

By narsimha lodeFirst Published May 15, 2020, 6:14 PM IST
Highlights

ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన కింద రూ. 20వేల కోట్లను మత్స్యకారులకు అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 
 


న్యూఢిల్లీ: ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన కింద రూ. 20వేల కోట్లను మత్స్యకారులకు అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

శుక్రవారం నాడు ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఫిషింగ్ హార్బర్లు, కోల్డ్ స్టోరేజీలకు రూ. 9 వేల కోట్లు కేటాయించినట్టుగా చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు రూ. 20వేల కోట్లను కేటాయించినట్టుగా చెప్పారు.

also read:పప్పులు, నూనెలు, ఆలు నిల్వలపై నియంత్రణకు నో, చట్ట సవరణ: నిర్మలా సీతారామన్

మత్స్య పరిశ్రమలో 55 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. లక్ష కోట్లను ఎగుమతి లక్ష్యంగా పెట్టుకొన్నామని కేంద్రం తెలిపింది. రొయ్యల సాగు, చేపల వేటకు రూ. 11 వేల కోట్లు కేటాయించినట్టుగా మంత్రి తెలిపారు. చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో వ్యక్తిగత భీమాతో పాటు పడవలకు కూడ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు మంత్రి.

పశువుల్లో వ్యాధుల నియంత్రణకు రూ.13,343 కోట్లు ఖర్చుచేస్తున్నట్టుగా చెప్పారు. పశువులు, గేదేలు, గొర్రెలు, మేకలు, పందులకు వంద శాతం వ్యాక్సినేషన్ అందిస్తామన్నారు. 53 కోట్ల జంతువులకు వ్యాక్సినేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు 1.5 కోట్ల ఆవులు, గేదేలకు వ్యాక్సినేషన్ చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.వ్యవసాయానికి కేటాయించిన నిధుల నుండి గోదాములు, కోల్డ్ స్టోరేజీల ను నిర్మించనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. 
 

click me!