కేంద్ర ప్రభుత్వం అత్యవసర సరుకుల చట్టాన్ని సవరించనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యవసర సరుకుల చట్టాన్ని సవరించనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
శుక్రవారం నాడు న్యూఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. 1955 నాటి అత్యవసర సరుకుల చట్టంలో కీలక మార్పులు చేయనున్నట్టుగా ఆమె తెలిపారు. రైతులు పండించిన పంటలకు మంచి ధర ఇచ్చేందుకు వీలుగా ఈ చట్టాన్ని సవరిస్తామన్నారు.
పప్పు ధాన్యాలు, నూనెలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ వంటిని నిల్వ చేసుకొనే విషయంలో పరిమితిని ఎత్తివేయనుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రం వీటి నిల్వలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది.వినియోగదారులకు అందుబాటులో వస్తువుల ధరలు ఉండేలా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆమె తెలిపారు.
also read:రైతులకు నిర్మలా గుడ్ న్యూస్: దేశంలో ఎక్కడైనా పంట అమ్ముకొనేలా చట్టం
కూరగాయలు, పండ్లు, ఉల్లిపాయల సరఫరా కోసం ఆపరేషన్ గ్రీన్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని కేంద్రం ప్రకటించింది.ఈ పథకంలో భాగంగా టమాట, ఉల్లిపాయ, ఆలుగడ్డలతో పాటు అన్నిరకాల పండ్లు, కూరగాయలకు ఆపరేషన్ గ్రీన్ పథకాన్ని విస్తరించినట్టుగా కేంద్రం తెలిపింది.
దేశంలోని టమాట, ఉల్లిపాయ, ఆలుగడ్డల సరఫరాను స్ధిరికరించడంతో పాటు దేశ వ్యాప్తంగా ఏడాది పాటున ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.ఆపరేషన్ గ్రీన్ లో భాగంగా పంటల రవాణాకు 50 శాతం, మరో 50 శాతం శీతల గిడ్డంగుల్లో ఖర్చు కోసం కేటాయించనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది.