గోవాలో రూ. 45 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్: ముగ్గురు అరెస్ట్

Published : Jul 30, 2023, 04:38 PM ISTUpdated : Jul 30, 2023, 04:53 PM IST
గోవాలో  రూ. 45 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్: ముగ్గురు అరెస్ట్

సారాంశం

గోవాలో  5.2 కిలోల హెరాయిన్ ను డీఆర్ఐ అధికారులు  ఆదివారంనాడు సీజ్  చేశారు. సీజ్ చేసిన  హెరాయిన్ విలువ  రూ. 45 కోట్లుగా ఉంటుందని  అధికారులు చెబుతున్నారు.

న్యూఢిల్లీ: గోవాలో  రూ. 45  కోట్ల విలువైన  హెరాయిన్ ను  ఆదివారంనాడు  డీఆర్ఐ  అధికారులు సీజ్ చేశారు.  ఇథిపియో నుండి  హెరాయిన్ ను తీసుకు వచ్చిన నైజీరియన్ మహిళతో పాటు మరో ఇద్దరిని  డీఆర్ఐ అధికారులు  అరెస్ట్  చేశారు. 5.2 కిలోల హెరాయిన్ ను  నిందితులనుండి డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.   

దేశంలోని పలు ప్రాంతాల్లో గతంలో కూడ  హెరాయిన్ ను  అధికారులు సీజ్ చేశారు. పలువురిని అరెస్ట్  చేసిన ఘటనలు  కూడ నమోదయ్యాయి.2022  ఫిబ్రవరి  20న ఢిల్లీలో  రూ. 50 కోట్ల విలువైన  హెరాయిన్ ను  పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్  చేశారు.  34.7 కిలోల  హెరాయిన్ ను  డీఆర్ఐ అధికారులు నిందితుల నుండి సీజ్ చేశారు. గోవా, ముంబై డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ముంబై ఎయిర్ పోర్టులో  హెరాయిన్ ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.రూ. 84 కోట్ల విలువైన  11.94 కిలోల హెరాయిన్ ను  స్వాధీనం చేసుకున్నారు  అధికారులు.ఇద్దరు నిందితులను  అరెస్ట్  చేశారు డీఆర్ఐ ఆఫీసర్స్.

ఈ ఏడాది మే  9వ తేదీన  తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో  5.9 కిలోల హెరాయిన్ ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.  దీని విలువ రూ. 41 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆఫ్రికా నుండి వచ్చిన మహిళ ప్రయాణీకురాలి నుండి  డీఆర్ఐ అధికారులు  హెరాయిన్ ను సీజ్ చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?