
మహారాష్ట్రలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖోపోలి ప్రాంతం సమీపంలో ముంబై - పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు అక్కడే చనిపోయారు. మరొకరు హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో పరిస్థితి విషమించి మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి కూడా తీవ్రగాయాలు అయ్యాయి. వీరంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో మహాత్మాగాందీ మునిమనవడు తుషార్ గాంధీ
వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి 12 గంటల సమయంలో మారుతీ సుజుకీ కారు పూణె నుంచి ముంబైకి వెళ్తోంది. ఆ సమయంలో కారులో 9 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఖోపోలి సమీపంలోకి చేరుకోగానే ఆ కారు ట్రక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఖోపోలి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలోనే నలుగురు చనిపోయారు. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ తరలించారు. అయితే ఈ క్రమంలో ఒకరి పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే మరణించారు.
సంచలన నిర్ణయం తీసుకున్న జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి
గాయపడిన వారందరినీ ఎంజీఎం హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనలో చనిపోయిన వారంతా పురుషులే, గాయపడిన నలుగురిలో ఒకరు మహిళ ఉన్నారని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఢిల్లీలో మరో షాకింగ్.. అనుమానంతో ప్రియురాలి గొంతు నులిమి చంపి...కూతురితో పరార్...
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని సెంగోల్‌లో అక్టోబర్ 31వ తేదీన కూడా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7 గురు మృతి చెందారు. మరో 5 గురు గాయపడ్డారు. షోలాపూర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో బాధితులంతా కొల్హాపూర్ నుండి పంఢర్‌పూర్‌కు మత యాత్ర కోసం వెళుతున్నారు.