టిఫిన్ తిన్న డబ్బులివ్వమన్నందుకు.. వేడి వేడి నూనె పోసి.. ఓ యువకుడి ఘాతుకం..

Published : Nov 18, 2022, 12:52 PM IST
టిఫిన్ తిన్న డబ్బులివ్వమన్నందుకు.. వేడి వేడి నూనె పోసి.. ఓ యువకుడి ఘాతుకం..

సారాంశం

టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకపోగా.. అడిగినందుకు ఎదురుదాడికి దిగాడో వ్యక్తి.. వేడి వేడి నూనెను టిఫిన్ బండి యజమాని మీద పోశాడు. 

గ్వాలియర్ : ఆ యువకుడు గ్వాలియర్ లోని ఓ సెంటర్లో తోపుడు బండిపై టిఫిన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రోజు ఉదయం కూడా బండి పై టిఫిన్ అమ్ముతున్నాడు. ఓ యువకుడు బండి వద్దకు వచ్చి టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. డబ్బులు ఇవ్వమన్నందుకు ఆ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. వేడివేడి నూనెను అతడి మీద పోశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెడితే.. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కు చెందిన సునీల్ 22 అనే యువకుడు కమల రాజా హాస్పిటల్ గేటు దగ్గర టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాడు. బండిపై రోజు టిఫిన్ అమ్ముతుండేవాడు. బుధవారం ఉదయం కూడా అలాగే బండి పెట్టాడు.సునీల్ బండి దగ్గరకు మోను అనే యువకుడు వచ్చాడు. టిఫిన్ తినేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో సునీల్ అతడిని పిలిచి డబ్బులు ఇవ్వాలని అడిగాడు. దీనికి మోను తర్వాత ఇస్తానని వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు.

ఢిల్లీలో మరో షాకింగ్.. అనుమానంతో ప్రియురాలి గొంతు నులిమి చంపి...కూతురితో పరార్...

అయితే, మోనూ చాలాకాలంగా అలాగే చేస్తుండడం.. అప్పు పెరిగిపోవడంతో ఇవ్వాళ ఎలాగైనా డబ్బులు ఇవ్వాల్సిందేనని సునీల్ పట్టుబట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మోను బండిమీద మరుగుతున్న వేడి వేడి నూనెలో తీసి సునీల్ మీద పోసేశాడు. ఒళ్లంతా కాలిపోవడంతో సునీల్ కేకలు వేశాడు. పక్కనే ఉన్న వారు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సునీల్ ను హాస్పిటల్కు తరలించారు. మోనును అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu