కటక్ లో ఘోర బస్సు ప్రమాదం

By Nagaraju TFirst Published Nov 20, 2018, 9:39 PM IST
Highlights

ఒడిశా రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మహానది వంతెనపై ప్రయాణిస్తున్న జగన్నాథ్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పినదిలో బోల్తా పడింది. 
 

కటక్‌: ఒడిశా రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మహానది వంతెనపై ప్రయాణిస్తున్న జగన్నాథ్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పినదిలో బోల్తా పడింది. 

ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది నుంచి 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. మిగిలిన వారు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. 
 
వివరాల్లోకి వెళ్తే  అనుగుల్‌ జిల్లా తాల్చేల్‌ నుంచి కటక్‌ వెళ్తుండగా జగత్ పూర్ సమీపంలోని మహానది బ్రిడ్జ్ వద్ద  ఓ ఎద్దును బస్సు ఢీకొట్టింది. ఢీకొట్టిన అనంతరం నదిలో పడిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. ఏసీ బస్సు కావడంతో ప్రయాణికులంతా బస్సులోనే చిక్కుకుపోయారు.  

వంతెన పైనుంచి సుమారు 40 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. నదిలో నీరు పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెనల సాయంతో బస్సులో చిక్కుకున్న వారిని వెలుపలికి తీస్తున్నారు. 

ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికితీశారు. ఇకపోతే ఘటనా స్థలంలో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు 10 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. ప్రమాదంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విచారంవ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆరోగ్య శాఖ మంత్రిని ఆదేశించారు.

click me!
Last Updated Nov 20, 2018, 9:39 PM IST
click me!