పెళ్లికొడుకు కి బులెట్ గాయం.. పెళ్లి మాత్రం ఆగలేదు

Published : Nov 20, 2018, 04:02 PM IST
పెళ్లికొడుకు కి బులెట్ గాయం.. పెళ్లి మాత్రం ఆగలేదు

సారాంశం

గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు. బులెట్ దిగి.. రక్తస్రావం కూడా అయ్యింది. అయినప్పటికీ...  పెళ్లి మాత్రం ఆగలేదు.

మరికాసేపట్లో.. వివాహ బంధంలోకి అడుగుపెడతాడన్న సమయంలో అనుకోకుండా.. వరుడుపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు. బులెట్ దిగి.. రక్తస్రావం కూడా అయ్యింది. అయినప్పటికీ...  పెళ్లి మాత్రం ఆగలేదు. ఆ గాయంతోనే యువకుడు పెళ్లి తంతు పూర్తి చేశాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఖాన్ పూర్ ఏరియాకు చెందిన బాదల్ అనే యువకుడికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. సోమవారం రాత్రి పెళ్లి తేదీ నిశ్చయించారు. వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో పెళ్లి అనగా.. వరుడు తన బంధువులుతో కలిసి ఊరేగింపుగా వస్తున్నాడు.

ఈ క్రమంలో అతనిపై దుండగులు తుపాకీతో దాడి చేశారు. గన్ తో వరుడిని కాల్చారు. దీంతో వరుడు తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే అతనిని... చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మూడు గంటల తర్వాత అతను వధువు మెడలో తాళికట్టాడు. అనంతరం శస్త్ర చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి వెళ్లాడు. కాగా.. వరుడు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Mid Day Meal: మ‌ధ్యాహ్న భోజ‌నంలో చికెన్ బిర్యానీ.. ప‌రిశీలిస్తోన్న రాష్ట్ర ప్ర‌భుత్వం
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం.. ఈ బిల్లుతో ఏం జరగనుంది.?