సీఎంపై కారప్పొడితో దాడి, చంపేస్తానని నిందితుడి వార్నింగ్

By Nagaraju TFirst Published Nov 20, 2018, 4:53 PM IST
Highlights

జెడ్ ప్లస్ కేటగిరి. 25 మంది సెక్యూరిటీ సిబ్బంది. ఎవరు లోపలికి వెళ్లాలన్నా కట్టుదిట్టమైన భద్రత. ఇది ఎవరికో ఈపాటికే అర్థమై ఉంటుంది కదూ. అలాంటి భద్రతా వలయాన్ని దాటుకుని ఏకంగా ముఖ్యమంత్రిపై కారప్పొడితో దాడి చేసి భద్రతపై సవాల్ విసిరాడు. 
 

ఢిల్లీ: జెడ్ ప్లస్ కేటగిరి. 25 మంది సెక్యూరిటీ సిబ్బంది. ఎవరు లోపలికి వెళ్లాలన్నా కట్టుదిట్టమైన భద్రత. ఇది ఎవరికో ఈపాటికే అర్థమై ఉంటుంది కదూ. అలాంటి భద్రతా వలయాన్ని దాటుకుని ఏకంగా ముఖ్యమంత్రిపై కారప్పొడితో దాడి చేసి భద్రతపై సవాల్ విసిరాడు. 

ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చారు. అంతలోనే ఓ దుండగుడు కారప్పొడితో అరవింద్ కేజ్రీవాల్ పై దాడికి పాల్పడ్డాడు. 

కారప్పొడి చల్లిన వెంటనే అంతే వేగంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నాడు. నిందితుడు నరియానా అనే ప్రాంతానికి చెందిన సునీల్ శర్మగా పోలీసులు విచారణలో గుర్తించారు. పారిపోతూ కేజ్రీవాల్ చంపేస్తా అంటూ పెద్దపెద్దగా అరుపులు వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 

కారప్పొడి దాడిలో సీఎం కేజ్రీవాల్ కళ్లజోడు కింద పడి పగిలిపోయింది. సీఎంపై దాడి జరిగిన వెంటనే అక్కడే ఉన్న ప్రజలు ఒక్కసారిగా అరుస్తూ భయంతో పరుగులు తీశారు. అంత్యంత భద్రత ఉండే సెక్రటేరియల్ లో సీఎంపై దాడి జరగడాన్ని ఆప్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దాడి ఢిల్లీ పోలీసుల భద్రతా వైఫల్యానికి నిదర్శనమంటూ ఆరోపిస్తున్నారు. 

ఇకపోతే ఇటీవలే ఆప్ కౌన్సిలర్ ఇంటిపై దాదాపు 25 మంది తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే ఏకంగా సీఎంపై దాడి జరగడం సర్వత్రా విస్మయానికి గురి చేస్తోంది.  

మరోవైపు నిందితుడుని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు నరియానా ప్రాంతానికి చెందిన సునీల్ శర్మగా గుర్తించినపోలీసులు ఎందుకు దాడి చెయ్యాల్సి వచ్చింది అన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. నిందితుడు సిగరెట్ ప్యాకెట్ లో కారప్పొడి నింపి దానితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

విజిటర్స్ రూమ్ దగ్గర ఉండి కేజ్రీవాల్ బయటకు రాగానే ఒక్కసారిగా దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఇకపోతే ఈ దాడి చూస్తుంటే ఢిల్లీలో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని ఆప్ విమర్శిస్తోంది. 

click me!
Last Updated Nov 20, 2018, 4:54 PM IST
click me!