ఇంద్రాణి పక్క సెల్ లోనే రియా: కటిక నేలపై చాప మీదే నిద్ర

By telugu teamFirst Published Sep 12, 2020, 7:31 AM IST
Highlights

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి జైలులో కష్టాలు ప్రారంభమయ్యాయి. సింగిల్ సెల్ లో ఆమె పడక, ఫ్యాన్ లేకుండా రాత్రి నిద్రపోవాల్సి వచ్చింది.

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి సంబంధించి డ్రగ్స్ కుట్ర కేసులో అరెస్టయిన రియా చక్రవర్తికి బైకుల్లా జైలులో కష్టాలు తప్పడం లేదు. ఆమెను అధికారులు సింగిల్ సెల్ లో ఉంచారు. 

ఆమె సెల్ పక్కనే ఇంద్రాణి ముఖార్జియా ఉంటోంది. తీవ్ర సంచలనం సృష్టించిన  కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో ఇంద్రాణి  ముఖార్జియా అరెస్టయిన విషయం తెలిసిందే. 

Also Read: రియా చక్రవర్తికి షాక్: బెయిల్ పిటిషన్ తిరస్కరణ

భద్రతా కారణాల రీత్యా రియా చక్రవర్తికి సింగిల్ సెల్ కేటాయించారు. సుశాంత్ మృతికి కారణమైందనే ఆగ్రహంతో సహ ఖైదీలు ఎవరైనా దాడి చేయవచ్చుననే అనుమానంతో ఆమెను సింగిల్ సెల్ లో ఉంచారు. 

మూడు షిఫ్టుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు 24 గంటలు ఆమెకు కాపలా ఉంటారు. పడుకోవడానికి ఆమెకు చాపను ఇచ్చినట్లు తెలుస్తోది. దిండు గానీ, పడక గానీ ఇవ్వలేదని అంటున్నారు. 

గదిలో సీలింగ్ ఫ్యాన్ కూడా లేదు. కోర్టు అనుమతి టేబుల్ ఫ్యాన్ ఇస్తారని అంటున్నారు. కోవిడ్ కారణంగా ఖైదీలకు పసుపు కలిపిన పాలు తాగడానికి ఇస్తున్నారు. 

Also Read: జైలులో రియా మొదటి రోజు ఎలా గడిపింది?

రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు మంగళవారంనాడు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబై కోర్టు శుక్రవారంనాడు కొట్టివేసింది. దీంతో ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది.

click me!