
కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో జనరల్ సెక్రటరీ పదవి నుంచి సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ను తొలగించింది.
ఆయన హర్యానా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుండగా.. ఆ బాధ్యత నుంచి కూడా తప్పించారు. ఆజాద్‌తో పాటు అంబికా సోనీ, మోతిలాల్ ఓరా, మల్లిఖార్జున ఖర్గేలను సైతం ఆయా పదవుల నుంచి తొలగించారు.
అలాగే యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ప్రియాంక గాంధీని నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మణికం ఠాగూర్ నియమితులయ్యారు.