Jailer: 'జైలర్'పై నెగిటివ్ రివ్యూ.. ఇద్దరిని చిత‌క‌బాదిన రజనీకాంత్ ఫ్యాన్స్

Published : Aug 10, 2023, 08:03 PM IST
Jailer: 'జైలర్'పై నెగిటివ్ రివ్యూ.. ఇద్దరిని చిత‌క‌బాదిన రజనీకాంత్ ఫ్యాన్స్

సారాంశం

Jailer: జైలర్ మూవీ పై నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు చెన్నైకి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను సూప‌ర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ చిత‌క‌బాదారు. చెన్నైలోని ఓ థియేటర్ ద‌గ్గ‌ర మీడియా మిత్రులు సినిమా ఎలా ఉంది అని రివ్యూల‌ను తీసుకుంటుండ‌గా, నెగిటివ్ రివ్యూ ఇచ్చార‌ని వారిపై రజనీకాంత్ అభిమానులు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.   

Rajinikanth fans: జైలర్ మూవీ పై నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు చెన్నైకి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను సూప‌ర్ స్టార్  రజినీకాంత్ ఫ్యాన్స్ చిత‌క‌బాదారు. చెన్నైలోని ఓ థియేటర్ ద‌గ్గ‌ర మీడియా మిత్రులు సినిమా ఎలా ఉంది అని రివ్యూల‌ను తీసుకుంటుండ‌గా, నెగిటివ్ రివ్యూ ఇచ్చార‌ని వారిపై రజనీకాంత్ అభిమానులు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

వివ‌రాల్లోకెళ్తే.. చెన్నైలోని క్రోమ్ పేట్ ప్రాంతంలోని వెట్రి థియేటర్ లో విలేకరులతో మాట్లాడుతూ 'జైలర్' సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చినందుకు ఇద్దరు వ్యక్తులను సూప‌ర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు చితకబాదారు. గురువారం తమ 'తలైవర్' సినిమా విడుదల సందర్భంగా చెన్నైలోని వివిధ థియేటర్ల వద్ద రజినీకాంత్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి, పూజలు నిర్వహించి, సినిమా పాటలకు డాన్సులు చేస్తూ చిందులేస్తున్నారు.

వెట్రి థియేటర్లో ఈ సినిమా సంగీత దర్శకుడు అనిరుధ్ తో కలిసి అభిమానులు 'హుకుం' పాటను ఆలపించారు. అయితే తొలిరోజు తొలి షోలో తమ అనుభవాల గురించి విలేకరులతో మాట్లాడుతూ 'జైలర్' సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు రజినీకాంత్ అభిమానులు ఇద్దరిపై దాడి చేయడంతో పరిస్థితులు ఊహించని మలుపు తిరిగాయి. గొడవలు జరగడంతో వీరిద్దరూ 'దళపతి' విజయ్ అభిమానులనీ, వారు 'తలైవర్' సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అభిమానులు ఆరోపించడం ప్రారంభించారు.

'జైలర్' ఆడియో వేడుకలో తలైవర్ ప్రసంగంపై రజినీకాంత్, విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర వాగ్వాదం జరిగింది. గతంలో విజయ్ నటించిన 'బీస్ట్' చిత్రానికి మంచి రివ్యూలు రాకపోవడంతో నెల్సన్ దిలీప్ కుమార్ తో కలిసి పనిచేయడం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని తన సన్నిహితులు సలహా ఇచ్చారని రజినీకాంత్ బాహాటంగానే చెప్పారు. ఇది 'దళపతి' (విజయ్) అభిమానులకు రుచించకపోవడంతో సోషల్ మీడియా యుద్ధానికి దారితీసింది. అయితే రివ్యూలు అంత గొప్పగా లేకపోయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిందని రజినీకాంత్ పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !