
దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఓ మహిళ తన సోదరిపై గన్‌తో కాల్పులు జరిపింది.తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 20 ఏళ్ల సోదరిని కాల్పులు జరిపినట్టు పోలీసులు గురువారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రి పార్క్‌లోని బులంద్ మసీదు సమీపంలో 20 ఏండ్ల సుమైల, తన అక్క 30 ఏండ్ల సోనూతో కలిసి ఉంటున్నది.
ఈ క్రమంలో తన భర్త, సోదరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు సోనూ అనుమానించింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహించిన సోనూ, చెల్లెలు సుమైల ముఖంపై కంట్రీ మేడ్ పిస్టల్‌తో పలుమార్లు దాడి చేసింది. అలాగే ఆమెపై కాల్పులు కూడా జరిపిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయ్ టిర్కీ తెలిపారు.
బాధితురాలు తీవ్రంగా గాయాలైనట్లు డీసీపీ తెలిపారు. తన చెల్లెలు సుమైల తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని సోనూ అనుమానించిందనీ, పోలీసులు శాస్త్రి పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 307 (హత్య ప్రయత్నం), ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సోనుని పోలీసులు అరెస్ట్ చేశారు. అనే విషయంపై విచారణ జరుగుతోంది.