Republic Day 2022 : ఐఏఎఫ్ శకటాల ప్రదర్శనలో పాల్గొన్న మొద‌టి మ‌హిళా రాఫెల్ పైలట్ శివాని సింగ్

By team teluguFirst Published Jan 26, 2022, 2:40 PM IST
Highlights

73వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ పరేడ్‌లో భారత వైమానిక దళానికి చెందిన తొలి మహిళా రాఫెల్ ఫైటర్ జెట్ పైలట్ శివాంగి సింగ్ పాల్గొన్నారు. వారణాసికి చెందిన శివాని సింగ్ 2017లో IAFలో చేరారు.

73వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ పరేడ్‌లో భారత వైమానిక దళానికి చెందిన తొలి మహిళా రాఫెల్ ఫైటర్ జెట్ పైలట్ శివాంగి సింగ్ పాల్గొన్నారు. ఆమె భారత వైమానిక దళం (IAF) శ‌క‌టంలో భాగ‌స్వామ్యం అయిన  రెండవ మహిళా ఫైటర్ జెట్ పైలట్. గ‌తేడాది ఫ్లైట్ లెఫ్టినెంట్ భావా కాంత్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

వారణాసికి చెందిన శివాని సింగ్ 2017లో IAFలో చేరారు. IAF రెండో బ్యాచ్ మహిళా ఫైటర్ పైలట్‌లలో ఆమె నియామితుల‌య్యారు. ఆమె రాఫెల్‌ను న‌డ‌ప‌డానికి ముందు మిగ్-21 బైసన్ విమానాలను న‌డిపేవారు. ఆమె పంజాబ్‌లోని అంబాలాలో ఉన్న ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ లో భాగంగా ఉన్న గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్ కు చెందిన ఉద్యోగి. 

‘‘భవిష్యత్తు కోసం భారత వైమానిక దళం రూపాంతరం చెందుతోంది’’ అనే  థీమ్ తో నేటి శకటాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రూపొందించింది. రాఫెల్ ఫైటర్ జెట్ లోని స్కేల్ డౌన్ మోడల్స్, స్వదేశీంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (LCH), 3D నిఘా రాడార్ Aslesha MK-1 ఈ ఫ్లోట్‌లో భాగంగా ఉన్నాయి. ఇది 1971 యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించిన MiG-21 విమానంలోని స్కేల్ డౌన్ మోడల్ ఇందులో ఉంది. ఇండియాకు పాకిస్తాన్ కు మధ్య జరిగిన యుద్దంలో ఈ విమానం పాల్గొంది.

రూ. 59,000 కోట్లతో 36 విమానాలను కొనుగోలు చేసేందుకు భారతదేశం- ప్రాన్స్ కు మధ్య ఒప్పందం జరిగిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మొదటి బ్యాచ్ రాఫెల్ ఫైటర్ జెట్‌లు జూలై 29, 2020 ఇండియాకు వచ్చాయి. ఇప్పటి వరకు 32 రాఫెల్ జెట్‌లను ప్రాన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు డెవవరీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మరో నాలుగు రావచ్చని అంచనా ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

ఇదిలా ఉండ‌గా.. భార‌త్ లో 73వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు (Republic Day 2022) ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సారి జ‌రుగుతున్న రిపబ్లిక్ డే 2022 వేడ‌క‌ల‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా భార‌త్ స్వాతంత్య్రం పొంది 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నారు. రాజ్‌ప‌థ్ లో కొన‌సాగుతున్న రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అక‌ట్టుకుంటోంది. ప‌రేడ్ లో మొద‌ట‌గా ఇండియ‌న్ ఆర్మీ ప‌రాక్ర‌మాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ప‌రేడ్ కొన‌సాగింది.రాజ్‌ప‌థ్‌లో ఇవాళ శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న అకట్టున్నాయి. అలాగే ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 75 విమ‌నాలు ప్ర‌త్యేక విన్యాసాలను ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. 

click me!