Republic Day 2022: రిప‌బ్లిక్ డే.. ఉత్త‌రాఖండ్ టోపీ, మ‌ణిపూర్ కండువాలో ప్ర‌ధాని మోడీ.. అందుకేనా?

By Mahesh RajamoniFirst Published Jan 26, 2022, 2:31 PM IST
Highlights

Republic Day 2022: భార‌త్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు (Republic Day 2022) ఘ‌నంగా జ‌రిగాయి.  రాజ్‌ప‌థ్ లో కొన‌సాగుతున్న రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అక‌ట్టుకున్నాయి. అయితే, ఈ గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ప్ర‌ధాని మోడీ వేష‌ధార‌ణ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఉత్త‌రాఖండ్ టోపీ, మ‌ణిపూర్ కండువాలో క‌నిపించ‌డంతో .. దీనిపై చ‌ర్చ మొద‌లైంది. 
 

Republic Day 2022: భార‌త్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు (Republic Day 2022) ఘ‌నంగా జ‌రిగాయి. భార‌త్ స్వాతంత్య్రం పొంది 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నారు. రాజ్‌ప‌థ్ లో కొన‌సాగిన రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అక‌ట్టుకుంది. భార‌తీయ విభిన్న సంస్కృతులు, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ.. రాష్ట్రాల శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగాయి. వివిధ రాష్ట్రాల‌తో పాటు వివిధ కేంద్ర శాఖ‌లు కూడా త‌మ శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించాయి. అత్యంత వైభ‌వంగా రిపబ్లిక్ డే (Republic Day 2022)ప‌రేడ్‌లో శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించారు.

అయితే, ఈ గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ (Prime Minister Narendra Modi) వేష‌ధార‌ణ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఉత్త‌రాఖండ్ టోపీ, మ‌ణిపూర్ కండువాలో క‌నిపించ‌డంతో .. దీనిపై చ‌ర్చ మొద‌లైంది.  2014లో ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తి స్వాతంత్య్ర‌, గ‌ణతంత్ర‌ వేడుక‌లకు త‌ల‌కు త‌ల‌పాగా ధ‌రించి సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. అయితే, ఈ సారి  జ‌రిగిన గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో మోడీ దానికి స్వ‌స్తి ప‌లికారు. బ్ర‌హ్మ‌క‌మ‌లం చిత్రంతో ఉన్న‌ ఉత్తరాఖండ్ సంప్ర‌దాయ‌ టోపీని త‌ల‌పై ధ‌రించారు. అలాగే, ఆయ‌న త‌న మెడ‌పై వేసుకున్న కండువా కూడా ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచింది. మ‌ణిపూర్ సంప్ర‌దాయానికి సంబంధించిన కండువాను ఆయ‌న (Prime Minister Narendra Modi) ధ‌రించారు.

అయితే, ప్ర‌ధాని మోడీ (Prime Minister Narendra Modi) ఈ వ‌స్త్ర‌ధార‌ణ కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఎందుకంటే ఇప్ప‌టివ‌ర‌కు గ‌ణ‌తంత్ర‌, స్వాతంత్య్ర వేడుక‌ల్లో ప్ర‌ధాని మోడీ క‌నిపించిన దానికి భిన్నంగా ఈ సారి ఉత్తరాఖండ్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల‌ సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబించే విధంగా.. త‌ల‌పాగా, మెడ‌పై కండువా వేసుకోవ‌డ‌మే. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఎన్నిక‌ల స్టంటే అని ఆరోప‌ణ‌లు సైతం వినిపిస్తున్నాయి. ఉత్త‌రాఖండ్, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఓట్ల కోసం ఆయ‌న ఇవాళ‌ ఆయా రాష్ట్రాల సంప్ర‌దాయ వ‌స్త్రాల‌ను ధ‌రించార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

ఇదిలావుండ‌గా, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి, రాష్ట్ర వారసత్వ సంపదను ప్రపంచం ముందు ప్రతిబింబించినందుకు ప్రధాని మోడీ(Prime Minister Narendra Modi) కి కృతజ్ఞతలు తెలిపారు. "ఈరోజు, 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీ దేవభూమి ఉత్తరాఖండ్ టోపీని ధరించి, బ్రహ్మ కమలంతో అలంకరించబడి, మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాన్ని గర్వించేలా చేసారు. ఉత్తరాఖండ్‌లోని 1.25 కోట్ల మంది ప్రజల తరపున, ప్రధానమంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. మణిపూర్ మంత్రి బిశ్వజిత్ సింగ్ సైతం ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 

आज 73वें गणतंत्र दिवस के अवसर पर माननीय प्रधानमंत्री श्री जी ने ब्रह्मकमल से सुसज्जित देवभूमि उत्तराखण्ड की टोपी धारण कर हमारे राज्य की संस्कृति एवं परम्परा को गौरवान्वित किया है। pic.twitter.com/9JDnZMHG7B

— Pushkar Singh Dhami (@pushkardhami)

Moment of great pride and honour for entire on seeing Adarniya PM Ji wearing a Manipuri stole 'Leirum Phee' on the glorious occasion of 73rd Republic Day of India, showcasing the exquisite tradition of the state. pic.twitter.com/DfltZ8TBsa

— Th.Biswajit Singh (@BiswajitThongam)
click me!