Republic Day 2022: జాతీయ యుద్ద స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ..

Published : Jan 26, 2022, 10:40 AM ISTUpdated : Jan 26, 2022, 10:42 AM IST
Republic Day 2022: జాతీయ యుద్ద స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ..

సారాంశం

దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారకం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం ఉదయం నివాళులర్పించారు.

దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారకం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం ఉదయం నివాళులర్పించారు. National War Memorial వద్ద అమరవీరులకు ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. దేశాన్ని రక్షించడంలో అమరవీరులు చేసిన అత్యున్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రధాని మోదీ రెండు నిమిషాలు మౌనం పాటించారు.  స్మారక చిహ్నం వద్ద సందర్శకుల పుస్తకంపై సంతకం చేశారు.

ఇక, బుధవారం ఉదయం ప్రధాని మోదీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్!’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లందరికీ నివాళులు అర్పిస్తున్నాను’ అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ఇక, ఈ సారి జ‌రుగుతున్న రిపబ్లిక్ డే 2022 వేడ‌క‌ల‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా భార‌త్ స్వాతంత్య్రం పొంది 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ (Republic Day 2022) శుభాకాంక్ష‌లు తెలిపారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సాధారణంగా జనవరి 24 నుండి ప్రారంభమవుతాయి. అయితే ఈ సంవత్సరం నుంచి కేంద్రం.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ (netaji subhas chandra bose) జయంతిని పుర‌ష్క‌రించుకుని జనవరి 23 నుంచే గ‌ణ‌తంత్ర వేడుక‌లు (Republic Day) నిర్వ‌హిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !