అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం లేదు: తేల్చేసిన ఈడీ

By narsimha lodeFirst Published Jan 4, 2024, 10:47 AM IST
Highlights


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం లేదని  ఈడీ అధికారులు స్పష్టం చేశారు.
 

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ ను  అరెస్ట్ చేస్తారనే ప్రచారంపై  ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  విచారణకు రావాలని  ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల  3న ఈడీ విచారణకు  అరవింద్ కేజ్రీవాల్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు.ఈడీ జారీ చేసిన సమన్లు రాజకీయ ప్రేరేపితంగా ఆయన పేర్కొన్నారు.ఈడీ విచారణకు సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ఈడీకి  అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.  

గురువారం నాడు ఉదయం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. అరెస్ట్ చేసిందనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని ఈడీ తోసిపుచ్చింది.  కేజ్రీవాల్ నివాసంలో ఇవాళ సోదాలు నిర్వహించాలని ఎలాంటి ప్రణాళిక లేదని ఈడీ అధికారులు తేల్చి చెప్పారు. 
 
ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మూడో దఫా విచారణకు  రాకపోవడంపై అరవింద్ కేజ్రీవాల్ నుండి స్పందనను తెలుసుకోవాలని  ఈడీ భావిస్తుంది.  ఈ మేరకు  మరోసారి  ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కు  సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. 

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: మూడోసారి ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ దూరం

 అరవింద్ కేజ్రీవాల్ ను  ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారని  బుధవారం నాడు రాత్రి మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్  సహా పలువురు నేతలు  అనుమానం వ్యక్తం చేశారు. గురువారం నాడు ఉదయం  సోదాలు నిర్వహించిన తర్వాత ఆయనను  అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు  ఎందుకు  సమన్లు పంపుతున్నారని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

గురువారంనాడు అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై దాడి చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయని అతిషి బుధవారం నాడు రాత్రి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.గురువారం నాడు ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారని ఆమ్ ఆద్మీపార్టీ  ప్రతినిధి జాస్మిన్ షా సోషల్ మీడియాలో  పోస్టు చేశారు.  



 

click me!