అయోధ్య : కాళేశ్వరం నిర్మాణ సంస్థే రామాలయాన్నీ కడుతోంది.. ఆ కంపెనీ వివరాలివే..

By SumaBala Bukka  |  First Published Jan 4, 2024, 9:45 AM IST

అయోధ్య రామాలయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఆసక్తిగా ఎదురుచూస్తే ఓ మహోత్సవం. మరి అలాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయాన్ని నిర్మించిందెవరో తెలుసా? 


అయోధ్య : అయోధ్యలో ప్రసిద్ధ రామాలయాన్ని నిర్మిస్తుంది లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి) నిర్మాణ సంస్థ. ఈ కంపెనీనీ ఇద్దరు స్నేహితులు ప్రారంభించారు. 

ఈ కంపెనీ ఎల్ అండ్ టీ పేరుతో చాలా పేరుపొందింది. కానీ రామాలయం నిర్మాణంతో ఎల్ అండ్ టీ ప్రస్థానంలో మైలురాయిగా మారిందని చెప్పుకోవచ్చు.

Latest Videos

ఈ ఆలయాన్ని వెయ్యేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మిస్తోంది ఎల్ అండ్ టీ. అంతే కాదు తీవ్ర భూకంపాలను 6కు మించిన తీవ్రతతో వచ్చినా తట్టుకునేలా నిర్మిస్తోంది. 

రామాలయం నిర్మాణానికి ముందు ఎల్ అండ్ టీ దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని తయారు చేసింది. 182 మీటర్లు అంటే 597 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. ఇది గుజరాత్ లోని కేవడియా కాలనీలో నర్మదా నదిపై నిర్మించారు. 

అయోధ్యలో పూజారులుగా ఎంపికైన 24మందిలో.. ముగ్గురు బ్రాహ్మేణేతరులు..

న్యూ ఢిల్లీలో ఉన్న లోటస్ టెంపుల్ ను కూడా ఎల్ అండ్ టీ కంపెనీనే నిర్మించింది. బహాయి హౌస్ ఆఫ్ వర్షిప్ ఇది. తామరపువ్వు ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం కులమతాలకు సంబంధం లేకుండా అందరూ వెళ్లేలా ఉంటుంది. 27 పాలరాయి రేకులతో అరవిచ్చుకున్న తామరపువ్వు ఆకారంలో ఇది ఉంటుంది.  

ఎల్ అండ్ టీకి తెలుగు రాష్ట్రాలకూ ప్రత్యేక అనుబంధం ఉంది. తెలంగాణలోని హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా, అభివృద్ధి మాడల్ గా నిర్మించిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ కూడా ఎల్ అండ్ టీ దే.

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ కూడా ఎల్ అండ్ టీనే. ఇటీవలి కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. 

ఎల్ అండ్ టీ కంపెనీ విదేశీ.. చేసే పనులు దేశీ. లారెన్స్ అండ్ టూబ్రో అనే ఇద్దరు డానిష్ ఇంజినీర్లు 1938లో బొంబాయిలో ఈ కంపెనీని ప్రారంభించారు. 

ఎల్ అండ్ టీ కంపెనీ భారత్ లో 80యేళ్లకుపైగా సేవలు అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో ఈ కంపెనీ విస్తరించి ఉంది. ఇంజనీరింగ్, కన్ స్ట్రక్షన్, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ సెక్టార్ లో కంపెనీ పనిచేస్తోంది. 

హెన్నింగ్ హోల్క్-లార్సెన్, సోరెన్ క్రిస్టియన్ టౌబ్రో అనే ఇద్దరు డానిష్ ఇంజనీర్లు రెండో ప్రపంచయుద్దానికి ముందు కోపెన్ హెగ్ లోని ఓ కంపెనీలో పనిచేసేవారు. 

రెండో ప్రపంచయుద్ధానికి ముందు భారత్ కు వచ్చిన లార్సెన్ తన పాత మిత్రుడు టుబ్రోను కలుసుకున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం మొదలు కాగానే అన్ని యూరప్ దేశాలకు చెందిన వారు తిరిగి తమ దేశాలకు వెళ్లిపోయారు. కానీ వీరిద్దరూ భారత్ లోని బాంబేలోని ఉండిపోయారు. ఈ కంపెనీనీ మొదలుపెట్టారు. 
 

click me!