Post Office Bill 2023 : 125 ఏళ్ల నాటి భారత తపాలా కార్యాలయ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో ప్రస్తుతం పరిస్థితులకు తగ్గట్టు రూపొందించిన పోస్టాఫీస్ బిల్లు 2023ను రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
Post Office Bill 2023 : పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభమయ్యాయి. తొలిరోజే 125 ఏళ్ల నాటి భారతీయ తపాలా శాఖ చట్టాన్ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన 'పోస్టాఫీస్ బిల్లు, 2023'ను రాజ్యసభ సోమవారం ఆమోదించింది. దేశంలోని పోస్టాఫీసులకు సంబంధించిన చట్టాన్ని ఏకీకృతం చేసి సవరించాలని ఈ బిల్లు చెబుతోంది.
mount merapi eruption : మౌంట్ మెరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం.. 23 మంది పర్వతారోహకులు మృతి..
undefined
అయితే బిల్లులోని కొన్ని అంశాలకు సంబంధించి ప్రతిపక్ష సభ్యులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వం నిఘా రాజ్యాన్ని సృష్టించాలనుకుంటోందా అని ప్రశ్నించారు. అయితే సభ్యుల అభ్యంతరాలను ప్రభుత్వం తోసిపుచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిబంధనలు కల్పించామని, పోస్టాఫీస్ బిల్లులో కూడా ఇలాంటి నిబంధనలు ఉన్నాయని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. అనంతరం కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో తపాలా కార్యాలయాలు, తపాలా సంస్థల పునరుద్ధరణకు ఈ కొత్త చట్టం అద్దం పడుతోందని సమాధాన ఇవ్వడంతో ఈ బిల్లును వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు.
తెలంగాణ కొత్త ఎమ్మెల్యేల్లో 80 మందిపై క్రిమినల్ కేసులు.. అత్యధికంగా ఎవరిపై ఉన్నాయంటే ?
కాగా.. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం.. రాష్ట్ర భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్, ఎమర్జెన్సీ, ప్రజా భద్రత దృష్యా ఏదైనా వస్తువును అడ్డుకోవడానికి, తెరవడానికి లేదా నిర్బంధించడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏ అధికారికైనా అధికారం ఇవ్వవచ్చు. అలాగే నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం సూచించిన సేవలను పోస్టాఫీస్ అందించాలని, ఆ సేవలను అందించడానికి అవసరమైన కార్యకలాపాలకు సంబంధించి పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ నిబంధనలు రూపొందించాలని చెబుతోంది. అలాంటి సేవలకు ఛార్జీలను నిర్ణయించాలని కూడా బిల్లు పేర్కొంది. నిబంధనల ప్రకారం ఉన్న బాధ్యతలు మినహా.. ఇండియా పోస్ట్ తన సేవలకు సంబంధించి ఎలాంటి ఇతర బాధ్యతను భరించబోదని ఈ బిల్లు చెబుతోంది.
దేశంలోని తపాలా కార్యాలయాల పనితీరును నియంత్రించడానికి, పౌర కేంద్రీకృత సేవలను అందించడానికి పోస్టాఫీసులను ఒక నెట్ వర్క్ గా అభివృద్ధి చేయడానికి వీలుగా సరళమైన శాసన చట్రాన్ని అందించడానికి కొత్త చట్టాన్ని రూపొందించారు. ఆ సేవలను అందించడానికి అవసరమైన కార్యకలాపాలకు సంబంధించి నిబంధనలను రూపొందించడానికి, అలాంటి సేవలకు ఛార్జీలను నిర్ణయించడానికి పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ కు అధికారం ఇవ్వాలని ఈ బిల్లు కోరుతుంది.